వయసుతో పాటు ముఖంపై ముడతలు రావడం సహజం అయితే వయసుతో సంబంధం లేకుండా ముఖంపై ముడతలు వస్తున్నాయి. చిన్న వయసులో ఉన్నవారు కూడా ముఖంపై ముడతల సమస్యను ఎదుర్కొంటున్నారు. ఒత్తిడి, కాలుష్యం, పోషకాహార లోపం వంటి కారణాలు ముఖంపై ముడతలు వచ్చేలా, చిన్న వయసులోనే వృద్ధాప్యం వచ్చేలా చేస్తున్నాయి. మన ఇంట్లోనే దొరికే వస్తువులతో చిన్న చిన్న చిట్కాలను ఉపయోగించి ముఖంపై ముడతలు పోగొట్టుకోవచ్చని చెబుతున్నారు. ఇక వాటిలో కొన్నింటి గురించి మనం తెలుసుకుందాం. ముఖంపై ముడతలు పోవడానికి కలబంద ఎంతో బాగా ఉపయోగపడుతుంది. కలబంద గుజ్జును పూసుకోవడం వల్ల చర్మం మీద ముడతలు, గీతలు తగ్గుతాయి. కలబందతో కొలాజిన్ ఉత్పత్తి జరిగి చర్మం మృదువుగా మారుతుంది. కలబందలో ఉండే మాయిశ్చరైజింగ్ గుణాలు చర్మం తేమగా, నిగారింపుతో ఉండేలా చేస్తాయి. ముఖంపై ముడతలు పోవడానికి తేనె ఎంతో బాగా ఉపయోగపడుతుంది. తేనెలోని యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఫ్రీ రాడికల్స్ నుంచి చర్మ కణాలను కాపాడతాయి. తేనే చర్మంలో ఉన్న తేమను కాపాడుతుంది. ముఖంపై ముడతలు పోవాలంటే తేనెను అప్లై చేసి కాసేపు ఆరనిచ్చి ఆపై గోరువెచ్చటి నీటితో శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే ముఖంపై ముడతలు తగ్గుతాయి. ముఖంపై ముడతలు పోవడానికి కొబ్బరి నూనె ఎంతో బాగా ఉపయోగపడుతుంది. కొబ్బరి నూనెలో ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. కొబ్బరి నూనె చర్మం హైడ్రేటెడ్ గా ఉంచడానికి, పోషణ అందించడానికి తోడ్పడుతుంది. కొబ్బరి నూనె ముఖానికి మసాజ్ చేసుకొని ఓ గంట పాటు ఉంచి ఆపై నీళ్లతో కడుక్కుంటే చర్మం మృదువుగా మారుతుంది. ముడతలు తగ్గుతాయి.
coconut oil
చలికాలంలో చల్లటి గాలులు, పెదవులు పొడిబారడం, శరీరంలో నీటి శాతం తగ్గడం, విటమిన్ లోపం ఇంకా పెదవులను నాలుకతో తడపడం వంటి కారణాల వల్ల పెదవులు పగులుతాయి. పగిలిన పెదవుల వల్ల చలికాలంలో చాలా మంది బాధపడుతూ ఉంటారు. చాలా మంది ఈ సమస్య నుండి బయటపడడానికి లిప్ బామ్ లను ఇంకా లిప్ కేర్ లను వాడుతూ ఉంటారు. అయితే ఈ చిట్కాలు మీ కోసమే. పెదవుల పగుళ్లను తగ్గించే చిట్కాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ చిట్కాను వాడడం వల్ల పెదవులు పొడిబారడం తగ్గి మృదువుగా, తేమగా ఇంకా అందంగా తయారవుతాయి. పెదవులకు వెన్న రాసుకోవడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. వెన్నలో పంచదార వేసి పెదవులపై నెమ్మదిగా రాస్తూ మర్దన చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల పెదవులపై ఉండే మృతకణాలు, పొరలు తొలగిపోవడంతో పాటు పెదవులు మృదువుగా తయారవుతాయి. అలాగే పెదవులు గులాబిరంగులో మెరుస్తూ ఉంటాయి. పెదవులకు కొబ్బరి నూనె రాసుకోవడం వల్ల పెదవుల పగుళ్లు తగ్గుతాయి. పెదవులు పొడిబారకుండా ఉంటాయి. వేళ్లతో నువ్వుల నూనెను తీసుకుని పెదవులపై రాసి మర్దన చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల తగినంత తేమ లభించి పెదవుల పగుళ్లు తగ్గుతాయి. కలబంద గుజ్జును వాడడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. పెదవులపై కలబంద గుజ్జును రాసి అరగంట పాటు అలాగే ఉంచాలి. తరువాత నీటితో శుభ్రం చేయాలి. ఇలా రోజూ చేయడం వల్ల పెదవులు తేమగా ఉండడంతో పాటు పగుళ్లు కూడా తగ్గుతాయి.
కొబ్బరి నూనె హానికరమైన సూక్ష్మజీవుల నుండి చర్మాన్ని రక్షిస్తుంది. కొబ్బరి నూనెలో ఉండే లారిక్, క్యాప్రిక్ యాసిడ్స్ వంటి కొవ్వు ఆమ్లాలు వాటి యాంటీమైక్రోబయల్ లక్షణాల వల్ల చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇవి చర్మంపై పెరిగే హానికరమైన సూక్ష్మజీవులను నాశనం చేస్తాయి. మొటిమలు, ఫోలిక్యులిటిస్, సెల్యులైటిస్ వంటి చర్మ వ్యాధులు శిలీంధ్రాలు, బ్యాక్టీరియా వల్ల కలుగుతాయి. చర్మం కోసం కొబ్బరి నూనె పొడి, పగిలిన చర్మానికి మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది. కొబ్బరి నూనె చర్మాన్ని హైడ్రేట్ చేయడానికి సహాయపడుతుంది. తేమను బాగా నిలుపుకోవడంలో ఉపయోగపడుతుంది. పొడి చర్మానికి కొబ్బరినూనె మంచి మందు. కొబ్బరి నూనె మొటిమల చికిత్సలో సహాయపడుతుంది. ఈ నూనెలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు మొటిమలను నివారిస్తాయి. ఇందులోని లారిక్, క్యాప్రిక్ యాసిడ్లు మొటిమలను కలిగించే బ్యాక్టీరియాను నాశనం చేయగలవు. శరీరంలో యాంటీఆక్సిడెంట్లు, కొల్లాజెన్ స్థాయిలను పెంచే సామర్థ్యం కొబ్బరి నూనెకు ఉంది. కొబ్బరి నూనె చర్మం మంటను తగ్గించడంలో సహాయపడుతుంది. యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్‌తో పోరాడటానికి కొబ్బరి నూనె సహాయపడతాయి. చర్మంపై నల్ల మచ్చలను తగ్గించడంలో కొబ్బరి నూనె ఉపయోగపడుతుంది. చర్మాన్ని హైడ్రేట్ చేయడానికి స్నానానికి ముందు లేదా తర్వాత అప్లై చేయవచ్చు. చలికాలంలో దీన్ని లిప్ బామ్‌గా కూడా ఉపయోగించవచ్చు.
సహజ సిద్ధమైన కొబ్బరినూనె చర్మానికీ, జుట్టుకీ ఎంతో మేలు చేస్తుంది. అది మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది. మేకప్ రిమూవర్‌గానూ ఉపయోగించుకోవచ్చు. రోజూ శరీరానికి రాసుకోవడం వల్ల చర్మంపై ఉన్న మచ్చలూ, గీతలూ కొంతకాలానికి తగ్గుముఖం పడతాయి. స్నానానికి ముందు శరీరానికి కొబ్బరి నూనెతో మసాజ్ చేసుకుంటే మంచిది. ఒంట్లోని తేమ బయటికి పోకుండా ఉంటుంది. గోరువెచ్చని కొబ్బరి నూనెని తలకి మసాజ్ చేసుకుంటే జుట్టు మృదువుగా, కాంతిమంతంగా తయారవుతుంది. జుట్టు నుంచి ప్రోటీన్లు బయటికి పోవడం తగ్గుతుంది. ఇది జుట్టుకి మంచి కండిషనర్‌గా పనిచేస్తుంది. కాలిన గాయాలూ, ఎండ వేడికి కమిలిన చర్మంపై కొబ్బరినూనె రాస్తే త్వరగా తగ్గుతాయి. కనురెప్పలకి రాసే మస్కారా, కాటుక వంటి మేకప్ కొబ్బరినూనెలో ముంచిన దూదితో తుడిస్తే సులువుగా పోతాయి.
నిరభ్యంతరంగా వాడుకోవచ్చు. వెజిటబుల్ ఆయిల్స్ కలిపినందువలన ఒక దానిలో ఉన్న ప్రయోజనాల కంటే పలు ప్రయోజనాలు లభించినట్టే కదా. sunflower, ఆలివ్ , కనోలా, కోకోనట్ ఇలా పలు నూనె లను ఒకదానితో ఒకటి కలిపి వాడుకోవచ్చు. ఉదాహరణకు పల్లి నూనె నువ్వుల నూనే కలిపి ఒక పూట వండితే మరోసారి కుసుమ, ఆవ నూనె కలిపి వండండి, మరో సారి సన్ ఫ్లవర్ ని ఆలివ్ తో కలిపి చూడండి. ఎంత రేషియో లో మిక్స్ చేయాలి అనేది మీ మీ ఇష్టం.. ఉదాహరణకు పల్లి నూనె అలవాటు ఉంటే అది మూడొంతులు తీసుకొని ఒకవంతు నువ్వుల నూనె కలుపుకోవచ్చు. ఒకే నూనె మాత్రం వాడకుండా ఉంటేనే మంచిది.





Total views : 75288