తిరుపతి జిల్లా పిచ్చాటూరు అరనియర్ ప్రాజెక్టును తనిఖీ చేసిన పుత్తూరు డిఎస్పి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మిచాంగ్ తుఫాన్ వల్ల సత్యవేడు నియోజకవర్గంలో నారాయణవనం, పిచ్చాటూరు, కె వి బి పురం మండలాల్లో భారీ వర్షాలు కురిసాయి అన్నారు. రాత్రి కురిసిన వర్షానికి అరనియార్ ప్రాజెక్ట్ కు వరద నీరు ఎక్కువ కావడంతో అరనియర్ ప్రాజెక్టు నుంచి దిగువకు 4000 క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్లు తెలిపారు. అరనియార్ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అరుణానది దాటే ప్రయత్నం చేయరాదని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా నీటిని కిందికి విడుదల చేసేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని అరనియార్ అధికారులకు సూచించారు. ఈ మీచాంగ్ తుఫాన్ వల్ల నారాయణవనం మండలం పాలమంగళం ఎస్సీ కాలనీ పూర్తిగా నీటమునగడంతో సుమారు వంద కుటుంబాలకు పునరావస కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
అరనియార్ ప్రాజెక్టును తనిఖీ చేసిన పుత్తూరు డిఎస్పి
71
previous post