మామూలు పాలకి ప్రత్యామ్నాయంగా ఓట్ మిల్క్ ని తీసుకోవచ్చు. సాధారణంగా మనం ఆవు పాలు లేదా గేదె పాలు తీసుకుంటూ ఉంటాము. వాటికి బదులుగా మనం ఈ ఓట్ మిల్క్ ని కూడా తీసుకోవచ్చు దీనిలో రుచి కూడా చాలా బాగుంటుంది. పైగా పోషకాలు కూడా అందుతాయి. ఓట్ మిల్క్ చాలా ఆరోగ్యం అని మనం చెప్పొచ్చు. అయితే అసలు ఓట్ మిల్క్ వల్ల కలిగే లాభాలు ఏమిటి..?, అనేది ఇప్పుడు చూద్దాం. ఓటు మిల్క్ డైరీ ఫ్రీ కలిగి ఉంటుంది. ఇది గేదె పాలు ఆవు పాలకి ప్రత్యామ్నాయంగా మనం తీసుకోవచ్చు. అయితే రోల్డ్ ఓట్స్ లేదా స్టీల్ కట్ ఓట్స్ ని నాన పెట్టడం ద్వారా ఇది వస్తుంది, నీటిలో నానబెట్టి బ్లెండ్ చేస్తారు. పూర్తిగా వడకట్టిన తర్వాత వచ్చే లిక్విడ్ ని తీసుకోవడం జరుగుతుంది. దీని కోసం క్లాత్ లో వడకట్టాలి. ఇలా నురగ వచ్చి పాలులా కనబడుతుంది. ఓట్స్ నుండి దీనిని తయారు చేస్తారు. మామూలుగా ఓట్స్ లో ఉండే న్యూట్రియన్స్ ఇందులో ఉండవు. దీనిలో బలవర్థకమైన విటమిన్ ఏ, విటమిన్ డి, క్యాల్షియం ఐరన్ మరియు పొటాషియం లభిస్తుంది. అయితే చాలా మందికి పాలు అంటే ఎలర్జీ ఉంటుంది. కానీ ఓట్ మిల్క్ ద్వారా మీకు అలర్జీ ఉండదు. కాబట్టి ఎవరైతే ఎలర్జీ అని పాలు తీసుకోరో వాళ్ళు దీన్ని తీసుకోవచ్చు. ఓట్ మిల్క్ లో బీటా గ్లూకాన్ కూడా ఉంటుంది మరియు ప్రోటీన్ కూడా ఇందులో ఉంటుంది. కాబట్టి దీనిని తీసుకోవడం మంచిదే. అలానే దీనిలో లో సాచ్యురేటెడ్ ఫ్యాటీ కంటెంట్ ఉంటుంది. కనుక దీనిని తీసుకోవచ్చు. ఓట్స్ మిల్క్ వల్ల కలిగే ఉపయోగాలు ఓట్ మిల్క్ లో చాలా తక్కువ కొలెస్ట్రాల్ ఉంటుంది. ఓట్ మిల్క్ వుండే పదార్ధాలు ఆరోగ్యాన్నీ మెరుగుపరుస్తుంది. ఓట్ మిల్క్ తాగడం చాలా ఆరోగ్యం ఓట్ మిల్క్ లో ఉండే క్యాల్షియం, విటమిన్ డి చాలా ప్రయోజనాన్ని ఇస్తాయి. ఓట్ మిల్క్ లో ఇవి ఉండడం వల్ల మీ బోన్ హెల్త్ బాగుంటుంది. ఓట్ మిల్క్ బరువు తగ్గడానికి కూడా సహాయం చేస్తుంది. దీనిలో ఉండే బీటా గ్లూకోన్ జీర్ణక్రియ నెమ్మదిగా ఉంచుతుంది. ఓట్ మిల్క్ ని తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఓట్ మిల్క్ లో విటమిన్ ఏ విటమిన్ డి సమృద్ధిగా ఉన్నాయి. దీనిని తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
ఓట్ మిల్క్ వల్ల కలిగే లాభాలు..!
77