కడుపులో నులిపురుగుల నివారణకు : జీలకర్రను తీసుకోవాలి. మజ్జిగలో ఇంగువనూ, జీలకర్రనూ, సైంధవ లవణాన్నీ కలిపి తీసుకుంటే పొట్ట ఉబ్బరింపు తగ్గుతుంది.
గుండె నొప్పులు తగ్గుటకు : జీలకర్రను కషాయంగా కాచి తాగితే గుండెనొప్పులు రాకుండా అరికడుతుంది. బీపీ, షుగర్‌ను కంట్రోల్ చేస్తుంది.
ఎలర్జీకి తగ్గుటకూ : శరీరంలో ఏర్పడే తామర, తెల్లమచ్చలు, బొల్లి వంటివి ఆరోగ్యాన్నే కాకుండా అందాన్ని కూడా దెబ్బతీస్తాయి. అందుకనే ఇటువంటి చర్మ వ్యాధులను త్వరిత గతిన గమనించి, వాటి బారి నుండి బయటపడడం చాలా అవసరం. ఇందుకుగాను సులభమైన పెరటి వైద్యం జీలకర్ర – చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎలర్జీకి జీలకర్ర గొప్ప ఔషధం.
గర్భాశయ బాధలు తగ్గుటకు : జీలకర్రను నేతిలో వేయించి, మెత్తగా దంచి సైంధవలవణం లేదా ఉప్పును కలిపి 2 పూటలా తీసుకొంటే గర్భాశయ బాధలు నెమ్మదిస్తాయి. దీన్ని అన్నంలో కాని, మజ్జిగలో కాని తీసుకోవాలి.
మూత్ర సంబంధ వ్యాధులకు : జీలకర్రను దోరగా వేయించి అంతకు సమానంగా వేయించని జీలకర్రను కలిపి పొడి చేసుకోవాలి. దీనికి సమానంగా పంచదార వీలైతే ఆవునెయ్యిని కలుపుకొని కుంకుడు కాయంత మాత్రలు చేసుకొని 2 పూటలా 2 చొప్పున మాత్రలు వేసుకొవాలి. దీనివల్ల మూత్ర సంబంధ వ్యాధులు, మూత్రంలో వేడి, మంట పచ్చదనం తగ్గుతాయి.
నీరసము తగ్గుటకు : ఎప్పూడూ నీరసం, కాళ్ళ నొప్పులు, పైత్యంతో బాధపడుతున్నవారు జీలకర్రను గాని, ధనియాలు+ జీలకర్ర మిశ్రమం గాని తీసుకొంటే మంచిది.
పేగులు శుభ్రపరచుట : ధనియాలు, జీలకర్ర సమానపాళ్ళలో తీసుకొని వాటిని విడివిడిగా వేయించి పొడి చేసుకోవాలి. అందులో తగినంగ సైంధవలవణం లేదా ఉప్పును కలిపి, అన్నంలో, టిఫిన్లు, మజ్జిగలో కలుపుకొని వాడుకుంటే పేగులు శుభ్రపడి రోగాలకుదూరంగా ఉంటారు.
పైత్యరోగాలకు : జీలకర్రను నిమ్మరసముతో కలిపి సూర్యోదయ సమయాన , సూర్యాస్తమ సమయమున రెండపూటలా తింటే తలతిప్పు , కడుపులోని వేడిని మొదలగు పైత్యరోగములు తగ్గును.
తేలుకుట్టుకు : జీలకర్ర , తేనె , ఉప్పు , నెయ్యి కలిపి నూరి తేలుకుట్టిన చొట కట్టు కట్టిన తేలు విషము హరించును.
నీళ్ళవిరోచనాలు తగ్గుటకు : అరతులము జీలకర్ర ఇనుమూ గరిటె లో మాడబెట్టి అందులులో 5-6 తులముల నీరు పోసి చల్లారిన తరువాత ప్రతి 4 గంటలకొకసారి తీసుకుంటే నీళ్ళవిరోచాను తగ్గుతాయి.
వాంతులు తగ్గుటకు : వేయించం జీలకర్ర తో సమముగా సైంధవలవణము కలిపి నూరి సీసాలో బద్రపరిచి రోజుకు కొంచము కొంచము గా రెండుపూటలా ఇచ్చిన వాంతులు తగ్గును.
రోగాలను తగ్గించే జీలకర్ర
119
previous post