మలబద్ధకం కారణంగా మానసిక సమస్యలు కూడా ఎదురవుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి వీలైనంత వరకూ ఈ సమస్య నుంచి ఎంత సులభంగా బయట పడితే అంత మంచిది. ఇలాంటి సమస్యలను ఎదుర్కొనడానికి ముఖ్య కారణం ఆహారపు అలవాట్లు. అందుకే మీరు తీసుకునే ఆహారంలో ఫైబర్, నీటి శాతం తక్కువగా ఉన్న ఆహారాలు తీసుకుంటే తిన్న ఆహారం జీర్ణం కాక మలబద్ధకం ఉంటుంది. కాబట్టి మీ ఆహారంలో ఖచ్చితంగా కొన్ని మార్పులు చేసుకోండి. చిలగడ దుంప తినడం వల్ల మలబద్ధకం సమస్యల తగ్గుముఖం పడుతుంది. ఇందులో ఫైబర్ కంటెంట్, నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. అంతే కాకుండా చిలగడ దుంపలో ఉండే గుణాలు ప్రేగులను శుభ్రం చేసేందుకు హెల్ప్ చేస్తుంది. ఇంకా ఓట్స్ తినడం వల్ల కూడా మలబద్ధకం సమస్య నుంచి బయట పడొచ్చు. ఓట్స్ లో ఫైబర్ అనేది అధికంగా ఉంటుంది. దీని కారణంగా తిన్న ఆహారం త్వరగా జీర్ణమైన మలవిసర్జన అవుతుంది. అంతే కాకుండా జీర్ణ, పొట్ట సమస్యల నుంచి కూడా ఉపశమనం పొంద వచ్చు. మలబద్ధకం సమస్యతో ఇబ్బంది పడేవారు తరుచుగా ఓట్స్ ని తీసుకోవడం మంచిది. చాలా మంది టైమ్ పాస్ గా కూడా పాప్ కార్న్ తింటూ ఉంటారు. చాలా మంది ఇది తింటే కడుపు ఉబ్బరంగా ఉంటుందనుకుంటారు. కానీ నిజానికి పాప్ కార్న్ తీసుకోవడం వల్ల మలబద్ధకం సమస్య నుంచి త్వరగా బయట పడొచ్చు. ఎందుకంటే ఇందులో ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రతి రోజూ సాయంత్రం పూట పాప్ కార్న్ తింటే చాలా మంచిది.
మలబద్ధకం సమస్యతో బాధపడుతున్నారా..!
62
previous post