మలబద్ధకం కారణంగా మానసిక సమస్యలు కూడా ఎదురవుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి వీలైనంత వరకూ ఈ సమస్య నుంచి ఎంత సులభంగా బయట పడితే అంత మంచిది. ఇలాంటి సమస్యలను ఎదుర్కొనడానికి ముఖ్య కారణం ఆహారపు అలవాట్లు. అందుకే మీరు తీసుకునే ఆహారంలో ఫైబర్, నీటి శాతం తక్కువగా ఉన్న ఆహారాలు తీసుకుంటే తిన్న ఆహారం జీర్ణం కాక మలబద్ధకం ఉంటుంది. కాబట్టి మీ ఆహారంలో ఖచ్చితంగా కొన్ని మార్పులు చేసుకోండి. చిలగడ దుంప తినడం వల్ల మలబద్ధకం సమస్యల తగ్గుముఖం పడుతుంది. ఇందులో ఫైబర్ కంటెంట్, నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. అంతే కాకుండా చిలగడ దుంపలో ఉండే గుణాలు ప్రేగులను శుభ్రం చేసేందుకు హెల్ప్ చేస్తుంది. ఇంకా ఓట్స్ తినడం వల్ల కూడా మలబద్ధకం సమస్య నుంచి బయట పడొచ్చు. ఓట్స్ లో ఫైబర్ అనేది అధికంగా ఉంటుంది. దీని కారణంగా తిన్న ఆహారం త్వరగా జీర్ణమైన మలవిసర్జన అవుతుంది. అంతే కాకుండా జీర్ణ, పొట్ట సమస్యల నుంచి కూడా ఉపశమనం పొంద వచ్చు. మలబద్ధకం సమస్యతో ఇబ్బంది పడేవారు తరుచుగా ఓట్స్ ని తీసుకోవడం మంచిది. చాలా మంది టైమ్ పాస్ గా కూడా పాప్ కార్న్ తింటూ ఉంటారు. చాలా మంది ఇది తింటే కడుపు ఉబ్బరంగా ఉంటుందనుకుంటారు. కానీ నిజానికి పాప్ కార్న్ తీసుకోవడం వల్ల మలబద్ధకం సమస్య నుంచి త్వరగా బయట పడొచ్చు. ఎందుకంటే ఇందులో ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రతి రోజూ సాయంత్రం పూట పాప్ కార్న్ తింటే చాలా మంచిది.
sweet potato
ఎరుపు, గులాబీ రంగులో ఉండే చిలకడదుంపలకు మట్టి అంటుకొని ఉందికదా అని కొనడం మానేయవద్దు. తప్పనిసరిగా కొనాలి. ఎందుకంటే వాటితో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అస్సలు మానరు. తియ్యగా ఉండే వీటిని కొందరు పచ్చివిగానే తినేస్తుంటారు. కొంతమంది ఉడకబెట్టి తింటారు. ఎక్కువ మంది సాయంత్రం వేళ స్నాక్ లా తీసుకుంటారు. వీటి గొప్పతనం గురించి తెలుసుకుందాం. వీటిని తింటే బరువు పెరిగిపోతామనే ఆలోచనతో చాలా మంది కొనరు. ఈ దుంపలను మనం రోజూ ఆహారంలో చేర్చుకోవచ్చు. చిలకడదుంపలను తీసుకుంటే వాటిలో పొటాషియం ఉంటుంది. రక్తపోటును నియంత్రిస్తుంది. హైబీపీకి కారణమయ్యే సోడియం చర్యను పొటాషియం నియంత్రిస్తుంది. ఈ దుంపలో విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. గుండె జబ్బులతో బాధపడేవారు వారానికి ఒకసారైనా వీటిని తినాలి. రక్తనాళాలు దెబ్బతినకుండా నిరోధించే యాంటీ ఆక్సిడెంట్ పోషకాలున్నాయి. గుండె ఆరోగ్యంగా ఉండాలంటే వీటిని తినాలి. తొక్క తీసేసి, కొద్దిగా నిమ్మరసం, ఉప్పు కలిపి తింటే ఆ రుచే వేరు. ఇలా తినడంవల్ల ఎక్కువ సమయం ఆకలి వేయదు. వీటిలోని పండి పదార్థంవల్ల కడుపు నిండిపోయిన భావన కలుగుతుంది. వీటిల్లో కరిగేవి, కరగనివి రెండు రకాల ఫైబర్ ఉంటుంది. కొలెస్ట్రాల్ ను నియంత్రించడంతోపాటు దాన్ని బయటకు పంపించడంలో కూడా సాయపడుతుంది. కొలెస్ట్రాల్ వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ దుంపలు తీసుకోవడంవల్ల కొలెస్ట్రాల్ కరిగి గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఆరెంజ్ కలర్ చిలకడ దుంపల్లో బీటా కెరోటిన్ పుష్కలంగా ఉంటుంది. శరీరంలో గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఇది క్యారెట్లో కూడా ఉంటుంది. చిలకడ దుంపలు తినడం ఎంతో మంచిది. దీర్ఘకాలిక మంట వల్ల గుండె జబ్బులు వస్తాయి. చిలకడ దుంపల్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలుంటాయి. శరీరంలో మంట తగ్గడంతోపాటు ఛాతి దగ్గర వచ్చే మంట లాంటిది తగ్గుతుంది.
Read Also..
Read Also..
బరువు తగ్గే ప్రయత్నం చేస్తున్న వాళ్లు ఏం తినాలన్నా ఇబ్బంది పడుతుంటారు. ఎందుకంటే, ఏం తిన్నా వందల కెలొరీలు కొవ్వుగా మారిపోతుంటాయి కనుక! మరేం ఆలోచించకుండా వంద కెలొరీల లోపుండే ఈ పోషకాలని ప్రయత్నించండి. ఓ పెద్ద గుడ్డుని తింటే ఎనభై కెలొరీలని మించి అందవు. పైగా అన్ని రకాల పోషకాలూ అందుతాయి. చెక్కు తీయకుండా ఒక ఆపిల్‌ని ఎంచక్కా తిన్నా మంచిదే. దీన్నుంచి అందే కెలొరీలు డెబ్భైకి మించవు. పది, పన్నెండు నానబెట్టిన బాదం పలుకులని బరువు పెరుగుతాం అని ఆలోచించకుండా తినేయొచ్చు. వీటి నుంచి కేవలం తొంభై కెలొరీలే అందుతాయి. రోజువారీ అవసరాలకు సరిపడే క్యాల్షియంలో సగం వీటి నుంచి లభిస్తుంది. శరీరానికి మేలు చేసే ఇతర పోషకాలూ పొందవచ్చు. కొవ్వు తీసేసిన అరకప్పు పెరుగు తింటే ఎనభై ఐదు కెలొరీలు మాత్రమే అందుతాయి. కొవ్వూ, ఉప్పు పెద్దగా ఉపయోగించని కప్పు సూప్ నుంచి అందే కెలొరీలూ వందలోపే ఉంటాయి. ఉడకబెట్టిన రెండు చిలగడదుంపలని తింటే ఆకలి తగ్గుతుంది. లభించే కెలొరీలు మాత్రం తొంభయ్యే.






Total views : 141412