ఈ ఆలయ నిర్మాణం ఎంతో ప్రాచీనమైనది. ప్రాచీన మధురై నగరానికి సంబంధించిన భౌగోళిక, సంప్రాదాయిక ఆచారాలను కలిగి వుంటూ ఒక కేంద్రంగా గుర్తించబడుతుంది. ఈ ప్రాచీన ఆలయానికి చుట్టూ వుండే గోడలు, వీధులు, నగర గోడలు చతురస్రాకారంలో నిర్మించబడి వుండేవి. నాలుగు ముఖాలతో ప్రవేశ ద్వారాలతో కలిగిన ఆలయాలో తమిళనాడులో వుండే అతికొద్ది దేవాయాల్లోనే ఇది ఒకటి. ఆలయ సముదాయం 45 ఎకరాలతో గుండ్రంగా వుండి, 254/237 మీటర్లతో పొడవున భారీ నిర్మాణంగా వుండేది. అప్పటిలో ఈ ఆలయానికి 12 గోపురాలు వుండేవి. పురాతన ఆలయం అయిన ఇందులో ఎందరో దేవతల సముదాయం వుండేది. అందులో ముఖ్యంగా శివాలయం ఆలయ సముదాయానికి నడిబొడ్డులో వుండేది. అలాగే ఆలయానికి వెలుపల ఏకశిలపై మలిచిన గణేశుని భారీ విగ్రహం వుంది. దీనిని ముఖురుని వినాయకర్ అని పిలుస్తారు. మీనాక్షీ విగ్రహం శివు విగ్రహానికి ఎడమవైపున వుంది. ఆలయ ప్రత్యేకతలు ఆలయానికి నలువైపులా నాలుగు ఎత్తైన రాజు గోపురాలు ఎంతో గంభీరంగా దర్శనమిస్తాయి. తూర్పు – పశ్చిమ దిశగా వున్న గోపురాలను 13, 14వ శతాబ్దాలలో సుందరపాండ్యన్, పరాక్రమ పాండ్యన్ అనే ఇద్దరు పాలకులు నిర్మించారని అదేవిధంగా దక్షిణ గోపురాన్ని శివ్వంది చెట్టియార్ అనే పాలకుడు 16వ శతాబ్దంలో నిర్మించినట్టు స్థలపురాణం పేర్కోబడుతోంది. దక్షిణవైపుగా వున్న గోపురం సుమారు 160 అడుగుల ఎత్తు వుంది. ఈ ఆలయంలో సుందరేశ్వర స్వామి, మీనాక్షీ అమ్మవారు మొదలగు దేవతలు కొలువై వున్నారు. మధురై ప్రాంతంలో వున్న సంస్కృతీ – సంప్రదాయాల ప్రకారం ఆలయానికి తూర్పువైపున వున్న అష్టలక్ష్మీ మండపం ద్వారా లోపలికి ప్రవేశం చేసి, మీనాక్షి అమ్మవారిని దర్శించుకోవాలి. ఈ ప్రవేశ ద్వారంపై అమ్మవారి ఘట్టాలు శిల్పాల రూపంలో ఎంతో అందంగా చెక్కబడి వున్నాయి. అలాగే స్వర్ణ కమల తటాకం కూడా ఎందో ఆకర్షణీయంగా వుంటూ భక్తులను ఎంతో ఉత్సాహపరుస్తుంది. ఆలయ సముదాయంలో వుండే రెండుబంగారు గోపురాలతోపాటు 14 అద్భుతమైన గోపురాలకు ముఖ్యదేవతలకు నిలయంగా వుంది.
Read Also..
Read Also..