రైల్వే శాఖకు చెందిన సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ ఈ సూపర్ యాప్‌ను డెవలప్ చేస్తోంది. ఈ ప్రాజెక్ట్‌కు ఇండియన్ రైల్వేస్ రూ.90 కోట్టు ఖర్చు చేయనుంది. ప్రస్తుతం అన్ని రైల్వే యాప్స్‌లో IRCTC రైల్ కనెక్ట్ అత్యంత ప్రజాదరణ పొందింది. ఇండియన్ రైల్వేస్ వివిధ రకాల సేవలకు కొన్ని యాప్స్ ఇప్పటికే లాంచ్ చేసింది. భారత్‌లో ప్రముఖ సంస్థల సేవలు కొన్నేళ్ల క్రితమే ఆన్‌లైన్ మోడ్‌లో అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడు మరింత సులభంగా సేవలను యాక్సెస్ చేసేందుకు అప్లికేషన్స్ రిలీజ్ చేస్తున్నారు. ప్రయాణికులకు అన్ని సేవలను ఒకే చోట అందించాలనే లక్ష్యంతో ఒక ఇంటిగ్రేటెడ్ మొబైల్ అప్లికేషన్‌ను రైల్వే శాఖ సిద్ధం చేస్తోంది. దీని ద్వారా రైల్వే ప్రయాణికులకు యూజర్ ఫ్రెండ్లీ ఎక్స్‌పీరియన్స్ అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. టికెట్ బుకింగ్స్, PNR స్టేటర్ చెకింగ్, ట్రైన్ ట్రాకింగ్ వంlటి అన్ని రకాల రైల్వే సేవలను ఇదే యాప్‌లో అందిస్తారు. దీనికి తాత్కాలికంగా ‘సూపర్ యాప్’ అని పేరు పెట్టారు. రైలు టికెట్ల బుకింగ్‌కు IRCTC రైల్ కనెక్ట్ యాప్, జనరల్ టికెట్లు తీసుకోవడానికి UTS, రైలు ఎక్కడుందో తెలుసుకునేందుకు ‘నేషనల్ ట్రైన్ ఎంక్వైరీ సిస్టమ్’ ఫిర్యాదులకు రైల్ మదద్ వంటి యాప్స్ ఉన్నాయి. దీంతో యూజర్లు సింగిల్ యాప్‌తో అన్ని సేవలను పొందవచ్చు. ప్రతి అవసరానికి వేర్వేరు అప్లికేషన్స్ డౌన్‌లోడ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఈ సేవలను అన్నింటికీ ఇంటిగ్రేట్ చేసి సూపర్ యాప్ ద్వారా అందుబాటులోకి తీసుకురానున్నారు. యూజర్ ఫీడ్‌బ్యాక్‌ను పరిగణనలోకి తీసుకుని సూపర్ యాప్‌ను రూపొందిస్తున్నట్లు సీనియర్ ప్రభుత్వ అధికారి ఒకరు చెప్పారు. ఇది ఇండియన్ రైల్వేస్ డిజిటల్ సేవల పనితీరును మెరుగుపరుస్తుందని తెలిపారు. రైల్వేస్‌కు సంబంధించిన అన్ని సేవలను ఈ అప్లికేషన్‌తో యాక్సెస్ చేసుకోవచ్చని, అవసరమైన డౌన్‌లోడ్స్‌ను ఇది తగ్గిస్తుందని సదరు అధికారి వెల్లడించారు.
రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. రైల్వే శాఖ కీలక నిర్ణయం!
59
previous post