OnePlus భారతదేశంలో రెండు కొత్త 12 సిరీస్ ఫోన్‌లను విడుదల చేసింది. OnePlus 12 ప్రారంభ ధర రూ. 64,999 కాగా, OnePlus 12R ప్రారంభ ధర రూ.39,999గా ఉంది. మిగతా కంపెనీల ఫోన్లతో పోల్చితే, వన్‌ప్లస్ ఫోన్ల ధర ఎక్కువగానే ఉంటుంది. అయితే ఈ కంపెనీ ఇప్పుడు ఈ చౌకైన ఫోన్లను రిలీజ్ చేసినట్లయింది. OnePlus 12R యొక్క 8GB RAM / 128GB స్టోరేజ్ వేరియంట్ ధర ₹39,999. అలాగే 16GB RAM / 256GB స్టోరేజ్ వేరియంట్ ధర ₹45,999. ఈ ఫోన్ యొక్క ఓపెన్ సేల్ ఫిబ్రవరి 6 నుంచి ప్రారంభమవుతుంది. OnePlus 12Rలో ఏ ఫీచర్లు ఉన్నాయో చూద్దాం. పవర్ కోసం, OnePlus 12R 5,500mAh బ్యాటరీని కలిగి ఉంది. దీనిని 100W SUPERVOOC ఛార్జర్ ద్వారా వేగంగా ఛార్జ్ చేయవచ్చు. కనెక్టివిటీ కోసం, ఈ OnePlus 12R ఫోన్‌లో NFC, Wi-Fi 7, బ్లూటూత్ 5.3, GPS, డ్యూయల్ నానో-సిమ్ సెటప్ ఉన్నాయి. కెమెరా గమనిస్తే, ఈ ఫోన్‌లో OIS, EIS సపోర్టుతో 50 మెగాపిక్సెల్ సోనీ IMX890 ప్రైమరీ సెన్సార్, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగాపిక్సెల్ మాక్రో ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం, కస్టమర్లకు ఈ తాజా స్మార్ట్‌ఫోన్‌లో 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంది. OnePlus 12R LTPO4.0కి సపోర్టుతో 6.78-అంగుళాల AMOLED ProXDR డిస్‌ప్లేను కలిగి ఉంది, అంటే స్మార్ట్‌ఫోన్ రన్నింగ్ యాప్‌ని బట్టి 1-120Hz రిఫ్రెష్ రేటుతో రన్ అవుతుంది. కంపెనీ యొక్క తాజా బడ్జెట్ ఫోన్‌లో Qualcomm Snapdragon 8 Gen 2 చిప్‌సెట్ అమర్చారు. ఇది అన్ని గ్రాఫిక్స్ పనుల కోసం Adreno 740 GPUతో జత చేసింది. OnePlus 12R 16GB చూస్తే, LPDDR5X RAM, 256GB UFS 4.0 స్టోరేజ్‌తో వస్తుంది.
OnePlus 12R ఫీచర్స్ అదుర్స్..!
123
previous post