యూరప్ దేశం స్వీడన్‌కి చెందిన హస్క్వర్నా కంపెనీ స్వార్ట్పైలెన్ 401 బైక్, విట్పైలెన్ 250 బైక్‌లను ఇండియాలో లాంచ్ చేసింది. ఈ బైకుల ధరలు కాస్త ఎక్కువే. వీటిలో స్వార్ట్పైలెన్ 401 బైక్ ఎక్స్-షోరూమ్ ధర రూ.2.92 లక్షలు ఉండగా. విట్పైలెన్ 250 బైక్ ఎక్స్-షోరూమ్ ధర రూ.2.19 లక్షలు ఉంది. స్వార్ట్పైలెన్ 401 బైక్, స్క్రాంబ్లెర్ బైక్. ఆఫ్ రోడ్ రెడీ డిజైన్‌తో రూపొందించారు. స్వార్ట్పైలెన్ 401 బైక్ హైలెట్స్ చూస్తే దీని ఇంజిన్ కెపాసిటీ 399 cc ఉంది. దీనికి 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఉంది. దీని కెర్బ్ బరువు 171.2కేజీలు ఉంది. ఇంధన ట్యాంక్ కెపాసిటీ 13.5 లీటర్లు ఉంది. సీట్ హైట్ 820 mm ఉంది. అలాగే ఇంజిన్ మాగ్జిమం పవర్ 42.9 bhp ఉంది. స్వార్ట్పైలెన్ 401 బైక్ ఒకే వేరియంట్, ఒకే కలర్లో ఉంది. దీనికి BS 6 ప్రమాణాలతో ఇంజిన్ ఉంది. ఇది 39 Nm టార్క్ ఇస్తోంది. ఈ బైక్ ఫ్రంట్, రియర్ బ్రేకులు డిస్క్ బ్రేకులు. దీనికి యాంటీ లాకింగ్ బ్రేకింగ్ సిస్టం ఉంది. ఈ బైక్‌కి రౌండ్ LED హైడ్ లైట్ డిజైన్ ఉంది. రింగ్ లాంటి LED DRL ఉంది. పాత మోడళ్లతో పోల్చితే కొత్త మోడల్ సైడ్ ప్యానెల్స్ ఆకర్షణీయంగా ఉన్నాయి. దీనికి ఆర్నమెంటల్ ఫ్రంట్ విజర్ ఇచ్చారు. సరికొత్త అండర్ బెల్లీ సెటప్‌తో సైడ్ మౌంటెడ్ ఎగ్జాస్ట్ని మార్చారు. ఇది KTM 390 డ్యూక్ తరహాలో ఉంది. ఈ బైక్‌కి సింగిల్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ ఉంది. దీనికి సిక్స్ స్పీడ్ గేర్ బాక్స్ లింక్ అయి వుంది. దీనికి బై-డైరెక్షనల్ క్విక్ షిఫ్టర్ ఉంది. ఇంకా ఈ బైక్‌కి రైడ్ బై వైర్, ట్రాక్షన్ కంట్రోల్, సూపర్ మోటో ABS, ఫైవ్ ఇంచ్ TFT, స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీ, టైప్ C ఛార్జింగ్ పోర్ట్ వంటివి ఉన్నాయి. స్వీడన్ కంపెనీ Husqvarna ఏడేళ్లుగా Svartpilen 401ని అంతర్జాతీయ మార్కెట్లో సేల్ చేస్తోంది. ఇప్పుడు ఇండియాలోనూ ఈ కొత్త బైక్ ఎంట్రీ ఇచ్చింది. ఇది దేశీయ కంపెనీలకు గట్టి పోటీ ఇస్తుందా అన్నది త్వరలో తెలుస్తుంది.
పవర్ఫుల్ బైక్ లాంచ్..!
49
previous post