కొత్తగా హైదరాబాద్ వచ్చిన వాళ్లందరూ చూడాలనుకునే ప్రముఖ పుణ్యక్షేత్రం చిలుకూరు బాలాజీ టెంపుల్. తెలంగాణ తిరుమలగా ప్రత్యేక గుర్తింపు ఉన్న ఈ ఆలయాన్ని దర్శించుకుని మనసులో స్వామివారిని కోరికలు కోరుకుంటే కచ్చితంగా నెరవేరుతాయని భక్తుల నమ్మకం. అందుకే ప్రతి రోజూ వేలాది మంది చిలుకూరు దర్శనానికి వస్తుంటారు. ఒక్క హైదరాబాద్ మాత్రమే కాదు రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు వస్తుంటారు. సెలవు రోజులైతే ఇసుకేస్తే రాలనంత జనం కనిపిస్తారు. అయితే ఎందుకు ఇంత మంది భక్తులు ఇక్కడికి వస్తుంటారు? ఈ ఆలయం చరిత్ర గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఆలయం చరిత్ర:
చిలుకూరి బాలాజీ ఆలయానికి 500 ఏళ్ల చరిత్ర ఉంది. తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామికి పరమభక్తుడైన గున్నాల మాధవరెడ్డి చిలుకూరులో ఉండేవారు. ఆయన ప్రతి సంవత్సరం ఎంత కష్టమైనా కానీ కాలినడకన తిరుపతి వెళ్లి స్వామివారిని దర్శించుకునేవారు. వయసు పైబడినాగానీ కాలినడకన వెళ్లి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం మాత్రం ఆపలేదు. అలా ఒకసారి మాధవరెడ్డి తిరుమలకు కాలినడకన వెళ్తుండగా మార్గం మధ్యలో అలసిపోయి సొమ్మసిల్లి పడిపోయారు. ఆ మగత నిద్రలో వచ్చిన కలలో మాధవరెడ్డికి స్వామివారు ప్రత్యక్షమయ్యారు. మాధవా ఇకపై నువ్వు నా దర్శనం కోసం ఇంతదూరం ప్రయాసపడి కాలినడకన రావాల్సిన అవసరం లేదు. నేను చిలుకూరిలోని ఒక పుట్టలో కొలువై ఉన్నా. వెలికి తీసి గుడి నిర్మించమని చెప్పి మాయమయ్యాడట. నిద్ర నుంచి మేలుకున్న మాధవరెడ్డి చిలుకూరు చేరుకుని ఇదే విషయాన్ని గ్రామస్థులకు చెప్పాడు. దీంతో అందరూ కలిసి పుట్ట వద్దకు వచ్చి గునపాలతో పెకిలించారు. అయితే పుట్టలో ఉన్న బాలాజీ విగ్రహం ఎదభాగంలో గునపం తగిలి రక్తం వచ్చింది. అలా దొరికిన బాలాజీకి గ్రామస్తులు అక్కడే ఆలయాన్ని నిర్మించి పూజలు చేయడం ప్రారంభించారు. ఆలయంలో కొలువైన బాలాజీ విగ్రహం ఎదభాగంలో గునపం గుచ్చుకున్న ఆనవాళ్లు ఇప్పటికీ కనిపిస్తాయి. అయితే చిలుకూరి బాలాజీ దేవాలయంలో 1963లో రాజ్యలక్ష్మి అమ్మవారిని ప్రతిష్ఠించారు.
చిలుకూరి బాలాజీ దేవాలయం
56
previous post