కారుమూరి నాగేశ్వరరావు (Karumuri Nageswara Rao):
తిరుమల శ్రీవారిని ఏపీ మంత్రి కారుమూరి నాగేశ్వర రావు దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం విఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలసి స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించగా.. ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు. ఆలయం వెలుపల ఏపీ మంత్రి కారుమూరి నాగేశ్వర రావు మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలు సుభిక్షంగా ఉండాలని స్వామి వారిని ప్రార్థించానన్నారు. సీఎం ప్రవేశ పెట్టిన పథకాల ద్వారా ప్రజలు సుభిక్షంగా ఉన్నారని తెలిపారు. విద్యార్థులకు నాడు నేడు ద్వారా మరింత మంచి జరగాలని కోరుకున్నానని అన్నారు.
Follow us on : Facebook, Instagram & YouTube.
వచ్చే ఎన్నికల్లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రజలు జగన్ మోహన్ రెడ్డే కావాలి-రావాలి కోరుకుంటున్నారని అన్నారు. చంద్రబాబు పాలనలో సంక్షేమం శూన్యమన్నారు. ప్రజలకు అన్నివిధాలా ఆదుకున్న నేత సీఎం జగన్ మాత్రనే అని కొనియాడారు. పార్టీ ఓ కుటుబం లాంటిది. మా కుటుంబ సమస్య మేమే తీర్చుకుంటామని చెప్పిన ఆయన.. ఒకరిద్దరు భయటకు వెళ్లిపోతే వారి వ్యక్తిగతం అన్నారు. తెలంగాణను తగలేసి ఏపీని తగలపెట్టడానికి షర్మిల వచ్చిందని ఎద్దేవా చేశారు. నిజం జగన్… అబ్బద్ధం చంద్రబాబు… అని ప్రజలు అంటున్నారు. భువనేశ్వరి నిజం గెలవాలని కార్యక్రమం చేపట్టారని కచ్చితం నిజం అయిన జగన్ గెలుస్తారని తెలియజేశారు. Read Also..
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.