Thursday, July 9, 2026
News Navigation
Thursday, July 9, 2026
News Navigation

Breaking

Thursday, July 9, 2026
Home Telangana మేడారానికి పగిడిద్దరాజు, జంపన్న

మేడారానికి పగిడిద్దరాజు, జంపన్న

by Satya
Pagiddaraju of Medara

సమ్మక్క, సారలమ్మ జాతర బుధవారం ప్రారంభం కానున్న నేపథ్యంలో.. వనదేవరుడు, సమ్మక్క భర్త పగిడిద్దరాజును, ఆయన తనయుడు జంపన్నను.. మేడారం తీసుకెళ్లేందుకు పూజారులు ఏర్పాట్లు చేశారు. గిరిజన సంప్రదాయాలు, శివసత్తుల పూనకాల మధ్య మహబూబాబాద్‌ జిల్లా గంగారం మండలం పూనుగొండ్లలోని దేవాలయం నుంచి పగిడిద్దరాజును, ములుగు జిల్లా కన్నెపల్లి నుంచి జంపన్నను మేడారం తీసుకెళ్లనున్నారు. ఉదయం 9 గంటలకు పూనుగొండ్ల సమీపంలోని దేవుడి గుట్ట నుంచి పగిడిద్దరాజును తీసుకొచ్చి దేవాలయంలో ప్రతిష్ఠిస్తారు. శాంతి పూజాకార్యక్రమాల అనంతరం పెన్క వంశీయులు పడగ రూపంలో పగిడిద్దరాజును పెళ్లికొడుకుగా సిద్ధం చేస్తారు. ఆ పడగ రూపాన్ని గ్రామంలో ఊరేగించిన అనంతరం పూనుగొండ్ల అడవుల నుంచి మేడారానికి కాలినడకన తీసుకెళతారు. పూజారి జగ్గారావుతోపాటు మరో పదిమంది పూజారులు, పలువురు భక్తులు పగడిద్దరాజు వెంట బయలుదేరుతారు. మధ్యలో గోవిందరావుపేట మండలం కర్లపల్లి లక్ష్మీపురంలోని పెన్క వంశీయుల వద్ద రాత్రికి విడిది కల్పిస్తారు. బుధవారం ఉదయాన్నే బయలుదేరి రాత్రి సారలమ్మ చేరుకునే సమయానికి పగిడిద్దరాజును మేడారం గద్దెకు చేరుస్తామని ప్రధాన పూజారులు తెలిపారు.

Read Also..

Follow us on : Facebook, Instagram & YouTube.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • తిరుమలలో జులై, ఆగస్ట్, సెప్టెంబర్‌లలో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు.
    తిరుమల శ్రీవారి దర్శనానికి రాబోయే మూడు నెలల్లో ప్రయాణ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్న భక్తులకు టీటీడీ ఒక ముఖ్యమైన ప్రకటన విడుదల చేసింది. జులై, ఆగస్ట్, సెప్టెంబర్ నెలల్లో పలు పర్వదినాలు, ప్రత్యేక ఉత్సవాలు జరగనున్న నేపథ్యంలో ఆయా తేదీలలో వీఐపీ…
  • పశ్చిమగోదావరి జిల్లా ఆలమూరులో నేలవాలిన 200 ఏళ్ల వేపచెట్టు.
    పశ్చిమగోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గంలోని పెనుమంట్రా మండలం ఆలమూరు గ్రామంలో సుమారు రెండు శతాబ్దాల చరిత్ర కలిగిన వేపచెట్టు ప్రత్యేక ఆధ్యాత్మిక విశ్వాసాలకు ప్రతీకగా నిలిచింది. గ్రామస్తులు తమ తాతలు, ముత్తాతల కాలం నుంచే ఈ చెట్టును అమ్మవారి స్వరూపంగా భావిస్తూ…
  • తిరుమలలో రికార్డ్ స్థాయిలో శ్రీవారి లడ్డూ ప్రసాదం విక్రయాలు.
    తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం విక్రయాలు ఈ ఏడాది జూన్ నెలలో రికార్డు స్థాయికి చేరుకున్నాయి. భక్తుల రద్దీ పెరిగిన నేపథ్యంలో టీటీడీ లడ్డూ ఉత్పత్తిని కూడా విస్తృతంగా పెంచి, ఎలాంటి కొరత లేకుండా ప్రసాదాలను అందిస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్…
Advertisements

You may also like

Our Visitor

039231
Total views : 194895

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: