Wednesday, August 26, 2026
News Navigation
Wednesday, August 26, 2026
News Navigation

Breaking

Wednesday, August 26, 2026
Home Andhra Pradesh దక్షిణ కొరియాలో మంత్రి నారా లోకేష్ పర్యటన.

దక్షిణ కొరియాలో మంత్రి నారా లోకేష్ పర్యటన.

by CVR NEWS
దక్షిణ కొరియాలో మంత్రి నారా లోకేష్ పర్యటన

రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఏపీ ఐటీ, ఎలక్ట్రానిక్స్, విద్యాశాఖ మంత్రి విదేశీ పర్యటన కొనసాగుతోంది. దక్షిణ కొరియా పర్యటనలో దిగ్గజ కంపెనీల ప్రతినిధులతో చర్చలు జరిపారు. మొదట ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా సీఈఓ హంగ్ జూ జియోన్‌,హ్యుందాయ్ మోబిస్ తోనూ చర్చలు జరిపారు. బుసాన్ లోని ప్రఖ్యాత ‘షూఆల్స్’ ఫ్యాక్టరీని ఆయన సందర్శించారు .ఏపీలో పెట్టుబడిదారులకు మంత్రి లోకేష్ భరోసా ఇస్తూ..పెట్టుబడిదారుల్లో విశ్వాసాన్ని నింపుతూ ముందుకు సాగుతున్నారు. దక్షిణ కొరియా పర్యటనలో ఉన్న రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ శాఖల మంత్రి నారా లోకేశ్‌.. ప్రముఖ హ్వాసంగ్‌ గ్రూప్‌ ఉన్నతస్థాయి ప్రతినిధులతో బుసాన్‌లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఏపీలో ఫుట్‌వేర్‌ తయారీ రంగాన్ని మరింత విస్తరించేలా పలు కీలక ప్రతిపాదనలు చేశారు. అదే ప్రాంతంలో ఇంటిగ్రేటెడ్‌ ఫుట్‌వేర్‌ కాంపొనెంట్‌, మెటీరియల్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ ఫెసిలిటీని కూడా ఏర్పాటు చేయాలని కోరారు. దీంతో దిగుమతులపై ఆధారపడటం తగ్గడంతో పాటు ఉత్పత్తి వ్యయాలు తగ్గుతాయని వివరించారు.ప్రీమియం బ్రాండ్ల కోసం పెర్ఫార్మెన్స్‌ టెక్నాలజీ, ఏఐ ఆధారిత కస్టమైజేషన్‌, సస్టెయినబుల్‌ మెటీరియల్స్‌పై పరిశోధనలు జరిగే నెక్స్ట్‌ జనరేషన్‌ అథ్లెటిక్‌ ఫుట్‌వేర్‌ ఆర్‌అండ్‌డీ, ఆసియా-పసిఫిక్‌ ఇన్నోవేషన్‌ సెంటర్‌ను కూడా ఏపీలో ఏర్పాటు చేయాలని సూచించారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: