Saturday, August 8, 2026
News Navigation
Saturday, August 8, 2026
News Navigation

Breaking

Saturday, August 8, 2026
Home Andhra Pradesh రేపు ముంబైకి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌.

రేపు ముంబైకి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌.

by CVR NEWS
ముంబైకి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌

ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ రేపు మరోసారి ముంబైకి వెళ్లనున్నారు. కొంతకాలంగా రొటేటర్ కఫ్ గాయంతో బాధపడుతున్న ఆయన..భుజాలకు సంబంధించిన చికిత్స చేయించుకోనున్నారు. రెండు భుజాల కండరాలు దెబ్బతినడంతో ఇబ్బంది పడుతున్న పవన్‌ కల్యాణ్‌..ముంబై హాస్పిటల్‌లో ఇప్పటికే వైద్య పరీక్షలు చేయించుకున్నారు. రొటేటర్ కఫ్ గాయంతోపాటు భుజానికి సంబంధించిన రెండు కండరాల్లో గాయం తీవ్రత ఎక్కువగా ఉన్నట్టు నిర్ధారించారు.. వెంటనే శస్త్ర చికిత్స చేయించుకోవాల్సి ఉంటుందని సూచించారు.. అయితే, ముందుగానే నిర్ణయించిన పలు పాలనాపరమైన, అధికారిక కార్యక్రమాలు ఉండడంతో.. కాస్త గ్యాప్ తీసుకున్న పవన్ కల్యాణ్.. ఇప్పుడు చికిత్స చేయించుకోవడానికి రేపు ముంబై వెళ్లనున్నారు. ఐతే చికిత్స పూర్తయిన తరువాత కొద్ది రోజులపాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. ఈ నేపథ్యంలో ఆయనకు చికిత్స పూర్తైయిన తర్వాత అధికారిక కార్యక్రమాలకు తాత్కాలికంగా విరామం ఇవ్వనున్నట్లు సమాచారం.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: