సీఎం రేవంత్‌రెడ్డిని MCHRD బోధి పెవిలియన్‌లో గోద్రేజ్ ఇండస్ట్రీస్ గ్రూప్ ప్రెసిడెంట్ రాకేశ్‌స్వామి, గోద్రేజ్ అగ్రోవెట్ ఆయిల్ పామ్ బిజినెస్ సీఈఓ సౌగతో నియోగి కలిశారు. గోద్రెజ్ ఆగ్రోవెట్ కంపెనీ ఆధ్వర్యంలో ఆయిల్ పామ్ సాగు విస్తరణపైన ముఖ్యమంత్రికి నివేదిక అందజేశారు రాకేశ్ స్వామి. తెలంగాణలోనే మొట్టమొదటి ప్రైవేట్ సమీకృత ఆయిల్ పామ్ కాంప్లెక్స్ త్వరలో ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ భేటీలో పలు కీలక అంశాలపైన చర్చించారు. ఖమ్మం జిల్లాలో 300 కోట్ల పెట్టుబడితో ఏర్పాటవుతున్న ఈ ప్రాజెక్ట్ ద్వారా 700 మందికి పైగా ఉపాధి లభించనుంది. ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ , నర్సీరీ, ఆర్ అండ్ డీ కేంద్రం , సీడ్ గార్డెన్ ఏర్పాటు కోసం ఖమ్మం జిల్లా కొనిజర్ల మండలం గుబ్బగుర్తి గ్రామంలో 113.5 ఎకరాల భూమిని గోద్రెజ్ ఆగ్రోవెట్ సంస్థకు కేటాయించింది ప్రభుత్వం. సీడ్ గార్డెన్ కోసం అదనంగా 35 నుంచి 40 ఎకరాల భూమిని కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరింది ఆ సంస్థ. ప్రాసెసింగ్ మిల్ కోసం రాహదారిని విస్తరించాలని ముఖ్యమంత్రిని కోరారు సంస్థ ప్రతినిధులు. టీజీఐఐసీ ఆధ్వర్యంలో రోడ్డు విస్తరణ చేపట్టాలని అధికారులను సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు.
సీఎం రేవంత్‌రెడ్డిని కలిసిన గోద్రేజ్ ఇండస్ట్రీస్ గ్రూప్ ప్రెసిడెంట్ రాకేశ్‌స్వామి.
39




Total views : 196363