అరసవల్లి సూర్య నారాయణ స్వామి దేవాలయము(Arasavelli)
శ్రీకాకుళం(Srikakulam), ప్రత్యక్ష దైవం, ఆరోగ్య ప్రధాత, ఆశేష భక్త జనంతో పూజలు అందుకుంటున్న అరసవల్లి సూర్య నారాయణ స్వామి దేవాలయములో(Arasavelli Sun Temple) మూలవిరాట్ని కిరణ స్పర్శ రెండవ రోజు కూడా తాకని కారణంగా భక్తులు నిరాశతో వెనుదిరిగారు. శ్రీకాకుళం జిల్లా అరసవిల్లిలో ప్రతి ఏటా రెండు సార్లు ఈ అద్భుత ఆవిష్కరణ జరుగుతుంది. సూర్యుడు ఉత్తరాయణం నుండి దక్షణాయనం కి స్థాన చలనం చెందిన సమయంలో ఈ అద్భుతం చోటు చేసుకుంటుంది. శ్రీ కృష్ణుడి అన్న బలరాముడు చే 11 వ శతాబద్ధంలో నిర్మించిన ఈ ఆలయ నిర్మాణంలో అప్పటి ఆర్కిటెక్చర్లు ఆ దేవాలయం నిర్మాణంలో తీసుకున్న మెలకువల రూప కల్పనే ఈ అద్భుతం ఆవిషిృతానికి నిదర్శనం.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఏడాదికి రెండు పర్యాయాలు మార్చి 9, 10 తేదీల్లోను, అక్టోబర్ నెల 1, 2, తేదీల్లోనూ ఈ సూర్య కిరణాలు స్వామివారి పాదాలను స్పర్శించడం పరిపాటి. ఉత్తరాయణం నుంచి దక్షణాక్షిణాయనానికి స్దాన చలనం చెందే ఈ రెండు రోజుల్లో ఉదయించే సూర్య కిరణాలు ఆలయ ప్రాంగణంలో ఉన్న గాలి గోపురం, అనీవెట్టు మండపం, ఆలయ ముఖ ద్వార శిఖరం మధ్య నుండి అనివెట్టి మండపం వద్ద ఉన్న ధ్వజ స్తంభాన్ని(Flagpole) దాటుకుని గర్భగుడిలో శాలిగ్రామ ఏకశిలతో చేసిన స్వామివారి పాదాల నుంచి శిరస్సు వరకూ కిరణాలు తాకుతాయి. ఆ రోజు ఆలయాన్ని దర్శించుకునే భక్తులు తమకు ఈ అద్భుత దృశ్యాన్ని కనులారా దర్శించుకునే భాగ్యం కలుగుతుంది. కానీ నేడు మబ్బుల కారణముగా కిరణ స్పర్శ లేదు. ఈ కిరణ స్పర్శ ను కనులారా చూసిన భక్తుల కంటికి సంబంధించిన రుగ్మతలు తొలగిపోవడంతో పాటు, కోరిన కోర్కెలు తీరతాయని ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ తెలిపారు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి