జిల్లాలో బాల్య వివాహాలు పూర్తిగా నివారించి బాల్య వివాహాల రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ గిరీష పిఎస్, శాసనసభ వ్యవహారాల సమన్వయకర్త, ప్రభుత్వ విప్, రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి, మదనపల్లె ఎమ్మెల్యే నవాజ్ భాష, జిల్లా ఎస్పీ కృష్ణారావు లు పేర్కొన్నారు.అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలోని నారాయణ కళ్యాణ మండపంలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ వారి ఆధ్వర్యంలో బాల్య వివాహాల నివారణపై తహసిల్దార్లు, ఎంపీడీవోలు, ఎంఈఓలు, సిడిపిఓలు, అంగన్వాడి సూపర్వైజర్లు, అంగన్వాడి వర్కర్లు, డ్వాక్రామహిళలకు ఒకరోజు వర్క్ షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మన దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయినప్పటికీ ఇంకా బాల్య వివాహాలు జరగడం చాలా బాధాకరమన్నారు. బాల్య వివాహాల వల్ల అమ్మాయి, అబ్బాయి జీవితం నాశనం అవుతుందని తల్లిదండ్రులు గుర్తించాలన్నారు. సచివాలయాల పరిధిలోని మహిళా పోలీసులు, పంచాయతీ సెక్రటరీలు, ఏఎన్ఎంలు, బాల్యవివాహాల వల్ల జరిగే అనర్థాల గురించి ప్రజలకు పూర్తి అవగాహన కల్పించాలన్నారు. ముఖ్యంగా ఎన్జీవోలు బాల్య వివాహాలు అధికంగా జరిగే ప్రాంతాలలో ప్రజలకు అవగాహన కల్పించి వివాహం చేసుకోబోయే అమ్మాయిలకు అబ్బాయిలకు కౌన్సిలింగ్ ఇవ్వాలన్నారు. చాలా పాఠశాలల్లో కేవలం పెళ్లి కోసమే అమ్మాయిలు డ్రాప్ అవుట్ అవుతుంటారని అమ్మాయిల డ్రాప్ అవుట్ లిస్టుపై ఎడ్యుకేషన్ అసిస్టెంట్లు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఆర్డీవోలు, తహసిల్దార్ లు, ఎంపీడీవోలు, ఐసిడిఎస్, వైద్యాధికారులు, విద్య శాఖ అధికారులు సమన్వయంతో ప్రతి నెల క్రమం తప్పకుండా డివిజన్ స్థాయి, మండలస్థాయి గ్రామస్థాయిలో బాల్య వివాహాల నిర్మూలనకు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయాలన్నారు. వైద్య ఆరోగ్యశాఖ వారి నివేదిక ఆధారంగా ఈ మధ్య కాలంలో అన్నమయ్య జిల్లాలో 18 సంవత్సరాలు తక్కువ వయసు ఉన్న ప్రెగ్నెంట్ వుమన్ 350 మంది ఉన్నారని ఎప్పుడైతే 18 సంవత్సరాల లోపు ప్రెగ్నెన్సీ ఉమెన్ లేరని గుర్తించినప్పుడు చాలా వరకు బాల్యవివాహాలను నివారించిన వారమవుతామన్నారు. కావున ప్రతి ఒక్కరూ బాల్య వివాహాల నిర్మూలనకు తమ వంతు కృషి చేసి మన జిల్లాను బాల్య వివాహాల నిర్మూలన రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు తమ వంతు కృషి చేయాలన్నారు.
బాల్య వివాహాలు అరికట్టాలి..
84
previous post