వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో బుదవారం రాత్రి కట్టుకొన్న భార్యనే కడతేర్చాడు కసాయి భర్త.. ఏదైనా బంధం నిలబడాలంటే వారి మధ్య నమ్మకం ఎంతో ముఖ్యం. ఆ నమ్మకం లేనప్పుడు అనుమానం అనే పెనుభూతం మొదలవుతుంది. దీనివల్ల చాలా దారుణాలు జరుగుతాయి. వారు ఆ క్షణం నుంచి సంతోషాన్ని మరిచిపోయి ఎదుటి వ్యక్తిపైన నిందలే కనిపిస్తాయి. అనుమానం రోజు రోజుకి పెరిగి ఒక్కసారిగా బద్దలై ఎన్నో అనర్థాలకు దారితీస్తుంది. ఎక్కువగా భార్యాభర్తల మధ్య సఖ్యత లేనప్పుడు ఇద్దరిలో ఎవరో ఒక్కరికి ఈ పెనుభూతం పట్టుకుంటుంది. ఈ అనుమానంతో రగిలిపోతున్న వ్యక్తి ఎలా ప్రవర్తిస్తారో తెలియని పరిస్థతి ఏర్పాడుతుంది. అలానే అన్నమయ్య జిల్లాలో దారుణం జరిగింది. భార్యపై అనుమానంతో భర్త గొంతుకు చున్ని వేసి హత్య చేశాడు. రాయచోటి పట్టణం సింగపూర్ వీధిలో నివాసం ఉంటున్న రేవతి వెంకటరమణ లకు 14 ఎండ్ల క్రితం వివాహం అయ్యింది.భర్త వెంకటరమణ వృత్తి రీత్యా భవన కార్మికుడు, ఆమె ఇంటి వద్దనే ఉంటు విరి దాంపత్య జీవితం సజావుగా సాగింది. వీరికి ఇద్దరు కుమార్తెలతోపాటు ఒక కొడుకు సంతానం వీరికి కలరు. అయితే ఈమధ్య కాలంలో వెంకటరమణ భార్యపై అనుమానం పెంచుకోవడమే కాకుండా తరచుగా ఘర్షణ పడుతున్నట్లు తెలియజేశారు. ఈ నేపథ్యంలో ఒక నెల నుండి రేవతి తన పుట్టింట్లో అమ్మ దగ్గరే ఉంటుంది. రేవతి రాయచూరు మండలంలో కొత్తగా ప్రారంభం కానున్న షాపింగ్ మాల్ లో నాలుగు రోజుల నుండి అక్కడే పని చేసుకుంటున్నది. అయితే నిన్న రాత్రి ఆమె భర్త మాట్లాడాలి అని నమ్మించి పట్టణ శివార్లలోని రింగ్ రోడ్ దగ్గరకు తీసుకువెళ్ళాడు. అక్కడే ఇద్దరి మధ్య మాట మాట పెరగడంతో భర్త క్షణికావేశం తో రేవతి వేసుకున్న చున్నితోనే ఆమె గొంతుకు వేసి చంపినట్లు వారు తెలియజేశారు. మి బిడ్డను హతమార్చనని రేవతి తల్లిదండ్రులకు ఫోన్ అతనే స్వయంగా చెప్పడం తో వెంటనే వారి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అర్బన్ సీఐ సుధాకర్ రెడ్డి వారి. సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని హత్యకు గల కారణాల అరా తీసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు పరారీలో త్వరలోనే అరెస్ట్ చేస్తామన్నారు..
వివాహిత మృతి కేసు లో కీలక మలుపు..
63
previous post