పుత్తూరు నుండి బెంగళూరుకు వెళ్లే బస్సులో పుల్లూరు క్రాస్ నుండి తానా చెక్పోస్ట్ రోడ్డు మధ్యలో బస్సులో ప్రయాణిస్తున్న అనసూయ అనే మహిళ వద్ద బంగారు నగలు దొంగలించిన కేసులో ముద్దాయిని 27 సంవత్సరాల వయసు కలిగిన రాధికను అరెస్ట్ చేసినట్లు నగరి డి.ఎస్.పి రవికుమార్ తెలిపారు. ఆయన కదనం మేరకు చిత్తూరు నగరంలోని మంగసముద్రం లెనిన్ నగర్ కాలనీకి చెందిన 27 సంవత్సరాల వయసు కలిగిన రాధిక బస్సులో ప్రయాణిస్తున్న అనసూయ వద్ద నుంచి 32 గ్రాముల నల్లపూసలు, 16 గ్రాముల ముత్యాల దండ, 22 గ్రాముల నెక్లెస్, 10 గ్రాముల లక్ష్మీ డాలరు, 32 గ్రాముల రాళ్ల గాజులు, 48 గ్రాముల సాదా గాజులు, 13 గ్రాముల బ్రేస్ లైట్, ఐదు గ్రాముల ముత్యాల పగడాలు, మూడు జతల 22 గ్రాముల బరువు కలిగిన బుట్ట కమ్మలు, తొమ్మిది గ్రాముల రాళ్ల కమ్మలు, 11 గ్రాముల డాలరు పగడాల దండ, 21 గ్రాముల ఉంగరాలు, బంగారు పట్టి కలిగిన 15 గ్రాముల వాచ్.. మొత్తం 262.98 గ్రాముల సొత్తును స్వాధీనం చేసుకొని నిందితురాలని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. ఈమె పైన ఆరు కేసులు ఉన్నాయని, పూతలపట్టు కల్లూరు కాణిపాకం గుడిపాల సోమల చిత్తూరు వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో పలు కేసులు ఉన్నాయని వెల్లడించారు. ఈ సమావేశంలో కార్వేటి నగరం సిఐ సత్తిబాబు ఎస్ఆర్ పురం ఎస్సై షేక్షావల్లి సిబ్బంది పాల్గొన్నారు.
Read Also..