డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా.. రాజోలులో మిచౌంగ్ తుఫాన్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో బీభత్సం సృష్టించింది. గత రెండు రోజులుగా ఈదురు గాలులతో కూడిన వర్షం వల్ల రైతులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మంగళవారం ఉదయం నుండి ఎడతెరిపి లేకుండా వర్షం పడుతూనే ఉంది. మలికిపురం, సఖినేటిపల్లి మండలాల్లో వర్షంతో పాటు సుడిగాలి తీవ్ర నష్టం చేకూర్చింది. మలికిపురం మండలం గుడిమెళ్ళంక మూలపోడులో, సఖినేటిపల్లి మండలం మోరిలో సుమారు ఐదు నిమిషాల పాటు సుడిగాలి తీవ్ర నష్టం చేకూర్చింది. సుడిగాలికి మూలపోడులో పాక కూలి పాడి గేదె మృతి చెందింది. రాజోలు దీవిలో మామిడి కుదురు రాజోలు మలికిపురం సఖినేటిపల్లి మండలాల్లో చాలా చోట్ల కొబ్బరి చెట్లు, భారీ వృక్షాలు, విద్యుత్ స్తంభాలు నేల కులాయి. చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. వరిచేలు నేలకొరిగాయి. చేతికి వచ్చిన పంట నేల పాలు కావడంతో రైతులుకు తీవ్ర నష్టం జరిగింది.
Read Also..