కొవ్వూరు టౌన్ పోలీస్ స్టేషన్ నందు ఎస్సైగా పనిచేస్తున్న D.భూషణం గారు ది 13-10-2023 తేదీన కొవ్వూరు టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో దొమ్మేరు గ్రామంలో ఒక ఫ్లెక్సీ చించిన వివాదంపై రెండు వర్గాల మధ్య గొడవలు జరుగు చున్నవనే సమాచారంతో, దొమ్మేరు గ్రామానికి చెందిన బొంతా మహేంద్ర, తండ్రి: శ్రీనివాసరావు, వయసు 21 సం. లు, కులం: మాల అనువానిని కొవ్వూరు టౌన్ పోలీస్ స్టేషన్ కు తీసుకుని వచ్చి, యేవిదమైన కేసు నమోదు చేయకున్నప్పటికీ సాయంత్రం వరకూ అనగా ది.13.11.2023 సాయంత్రం 05.00 గం. ల వరకూ పోలీస్ స్టేషన్ లో వుంచినట్లు, ఆ వ్యక్తిని టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ గారు పోలీస్ స్టేషన్ కి వచ్చిన వెంటనే, అతని బందువులకు అప్పగించి యింటికి పంపినారు. ఆ తరువాత అనగా 13/14.11.2023 రాత్రి సదరు బొంతా మహేంద్ర తన యింటివద్ద పురుగుమందు త్రాగి ఆత్మహత్య కు ప్రయత్నించగా, అతని స్నేహితులు, బందువులు అతనిని మొదట కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రికి, అక్కడినుండి చాగల్లు ప్రయివేటు ఆసుపత్రికి, అక్కడినుండి పోలీస్ వారి సహాయంతో రాజమహేంద్రవరం రవి కిడ్నీ & చిల్డ్రన్ హాస్పిటల్ కి, అక్కడినుండి KIMS బొల్లినేని హాస్పిటల్కి తరలించి, వైద్య సహాయం అందజేసి, అతని ఆరోగ్యం కుదుటపడనందున అతనని ది.14.11.2023 రాత్రి విజయవాడ మణిపాల్ ఆసుపత్రికి తరలించగా, అక్కడ వైద్యం పొందుతూ ది.15.11.2023 తెల్లవారుజామున మరణించారు. సదరు బొంత మహేంద్ర తనను పోలీస్ స్టేషన్ కి తీసుకుని వెళ్లినందుకు మనస్తాపానికి గురై పురుగు మందు త్రాగానని చెప్పటంవల్ల, అతనిని కొవ్వూరు టౌన్ SI D. భూషణం గారు ఏవిదమైన కేసు నమోదు చేయకుండా, తన పై అధికారులకు సమాచారం యివ్వకుండా పోలీస్ స్టేషన్ కి తీసుకురావటమే కాక, సాయంత్రం వరకూ ఎటువంటి విచారణ లేకుండా నిర్భందించి నందున, సదరు బొంత మహేంద్ర నిర్భందానికి దారితీసిన పరిణామాలపై ఎస్పీ గారు విచారణ చేసి SI D.భూషణం గారిపై ప్రత్యేక నివేదిక ఏలూరు డిఐజి గారి పంపగా డిఐజి గారు తక్షణమే కొవ్వూరు టౌన్ పోలీస్ స్టేషన్ లో పనిచేయుచున్న SI D.భూషణం గారిని సస్పెండ్ చేయడం జరిగినది.
ఈ సంఘటన ద్వారా జిల్లా పోలీసు అధికారులు తమ సిబ్బంది కేసులలో నిదితులను గాని, నిందితులు కానీ వారిని కానీ, 7 సం. వరకూ శిక్ష విధించదగ్గ కేసులలో ముద్దాయిలను గానీ, విచారణ కొరకు గానీ, మరియే యితర అవసరానికి గానీ సరయిన నోటిస్ అమలు చేయకుండా పోలీస్ స్టేషన్ కి తీసుకు రాకూడదని, అట్లు చేసినయెడల డిపార్ట్మెంట్ పరంగా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని, అదేవిధంగా పోలీస్ శాఖలో యెవరైనా క్రమశిక్షణ తప్పినా, విధినిర్వహణలో నిర్లక్ష్యం వహించినా, అవినీతికి పాల్పడినా, పోలీస్ శాఖ తీసుకొనే చర్యలు తీవ్రంగా వుంటాయని, ఈ విషయం దృష్టిలో వుంచుకొని సిబ్బంది వారికి అప్పగించిన బాధ్యతలను నిర్వహించాలని ఈ సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ గారు తెలియ పరిచినారు.
Read Also..