కాకినాడ జిల్లా కలెక్టరేట్ కార్యాలయ ప్రాంగణంలో ఉన్న స్పందన హాల్లో వరల్డ్ ఎయిడ్స్ డే కార్యక్రమం జిల్లా ఎయిడ్స్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ యూనిట్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా కలెక్టర్ కృత్తికా శుక్ల, ఎమ్మెల్సీ కర్రీ పద్మశ్రీ, జిల్లా ఎస్పీ సతీష్ కుమార్, జెసి ఇలక్కియ తదితరులు హెచ్ఐవి వ్యాధిగ్రస్తులకు అవగాహన కల్పించడంతోపాటు పౌష్టికాహారాన్ని అందించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి సిలోం బ్లైండ్ సెంటర్ వారిచే 250 మందికి పైగా పౌష్టిక ఆహారాన్ని అందించారనీ, ఇప్పటివరకు 1200 బోర్లను, వివిధ ప్రాంతాలలో రెండు వేలకు పైగా మెడికల్ క్యాంపులను, తల్లిదండ్రులు లేని అనాధలను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దడంలో ప్రముఖ పాత్ర వహిస్తున్న ప్రవీణ్ చక్రవర్తి సేవలు అభినందనీయమని కలెక్టర్ అన్నారు. ఈ కార్యక్రమంలో వాలంటీర్లు సేవలు అభినందనీయమని పేర్కొన్నారు.
Read Also..