తిరుపతి అభివృద్ధికి బీజేపీ ఎప్పుడు మద్దతిస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి లంకా దినకర్ తెలిపారు. తిరుపతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం తిరుమలను ఆదాయ వనరుగా చూస్తుందని ఆరోపించారు. హిందు అధ్యాత్మిక కార్యక్రమాలకు, టీటీడీ సంస్థలకు సేవ చేసే భాద్యత టీటీడీదే అని తెలిపారు. గడిచిన నాలుగు సంవత్సరాల నుంచి పెద్ద ఎత్తున టీటీడీ నిధులు తరలించారని ఆరోపించారు. కేంద్ర, రాష్ట ప్రభుత్వాలు ఇచ్చే నిధులు, ఎక్కడికి పొతున్నాయంటూ ప్రశ్నించారు. తిరుపతి అభివృద్ది కోసం కేంద్రం 500కోట్లు విడుదల చేస్తే, కేవలం వందకోట్లు ఖర్చు పెట్టిందన్నారు. కేంద్రం ఇచ్చిన నిధులను సరిగ్గా ఖర్చు పెట్టకుండా టీటీడీ నిదులను కాజేస్తున్నారని తీవ్ర స్తాయిలో ఆరోపణలు చేసారు.
Read Also..
Read Also..