కాకినాడ శ్రీ పీఠంలో మహాశక్తి యాగం అత్యంత వైభవంగా గురువారం మూడవ రోజు నిర్వహించారు. 13వేల మంది పైగా మాతృమూర్తులు 100 కోట్ల లలితా సహస్రనామ పారాయణ కుంకుమ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. తిరుత్తరిణి పీఠాధిపతి శ్రీ శ్రీ శివానంద దీక్షిత విచ్చేశారు. కాకినాడ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ చైతన్య రాజు పాల్గొన్నారు. మూడవరోజుతో పాల్గొన్న భక్తుల మాతృమూర్తుల సంఖ్య ప్రకారం 6 కోట్లకు పైగా లలితా సహస్రనామ పారాయణ సంఖ్య పూర్తయిందని స్వామీజీ తెలిపారు సహస్రావధాని గడిమెల్ల ప్రసాద్ మాట్లాడుతూ నా సొంత ఊరు నుండి బయలుదేరి ఇక్కడికి వచ్చేవరకు అన్నీ గుర్తున్నాయని వచ్చాక 12 వేలకు పైగా ఐశ్వర్యాంబిక అమ్మవార్లు కనిపిస్తున్నారన్నారు. ఇంతమందిని ఒకే రకంగా ఒకే భాషగా దర్శించడం చాలా ఆనందంగా ఉందన్నారు లక్ష కుంకుమార్చన అంటే అమ్మో అంటాం కోటి కుంకుమార్చన అంటే అయ్యబాబోయ్ అంటాం. శతకోటి కుంకుమార్చన అంటే ఎలా సాధ్యమవుతుందో అనే అనుమానం పోయిందన్నారు ఇది ఒక్క పరిపూర్ణానంద స్వామీజీకి సాధ్యమన్నారు. కార్యసిద్ధి అంటే ఇదేనన్నారు. హనుమంతుడు లంకకు వెళ్ళేటప్పుడు 100 యోజనాలు దాటి లంకకు వెళ్ళగానే ఇంతేనా దూరం అనుకున్నట్లు పరిపూర్ణానంద స్వామీజీ చేస్తున్న ఈ కార్యక్రమాన్ని చూసాక ఇంతేనా అన్నట్లు మహాలక్ష్మిని లలితా దేవిని ఆరాధించడం చూసి సంభ్రమాశ్చర్యానికి గురి అయ్యాను అన్నారు అనంతరం మహా అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు.
Read Also..