హాజరైన మంత్రి బొత్స సత్యనారాయణ, వైవి సుబ్బారెడ్డి, జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, స్థానిక ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ గత పాలకుల మాదిరిగా మాటలకే పరిమితమవకుండా జిల్లా అభివృద్ధిలో జగన్ మార్క్ కనిపిస్తుందని చెప్పారు. దాదాపు 1200 ఎకరాల విస్తీర్ణంలో బొడ్డవర సమీపంలో ఎస్ ఈ జెడ్ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నామని దీని ద్వారా మూడు వేల కోట్లకు పైగా పెట్టుబడులు జిల్లాకు రావటం వల్ల జిల్లాలో నిరుద్యోగ సమస్యకు పరిష్కారం లభిస్తుందని చెప్పారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పనులు కూడా ప్రారంభమవుతున్నాయని జిల్లా వ్యాప్తంగా రైతులు వర్షాధారం పైనే ఆధారపడి పంటలు పండిస్తున్నారని ఇటువంటి పరిస్థితుల్లో సుజల స్రవంతి లాంటి ప్రాజెక్టు పూర్తి చేయడం ద్వారా రైతులకు సాగునీరు అందించవచ్చునని తెలిపారు రాష్ట్రంలో సంక్షేమ ఫలాలను అట్టడుగు స్థాయికి తీసుకెళ్లిన ఘనత ఒక్క వైకాపా ప్రభుత్వానిదే అని చెప్పారు…
శృంగవరపుకోట నియోజకవర్గంలో ప్రజా సాధికార యాత్ర..
120
previous post