మిచాంగ్ తుఫాన్ ప్రభావంతో తిరుపతి నగరంలోని పలు లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరిపోయింది. దీంతో వెంటనే సహక చర్యలు చేపట్టేందుకు స్వయంగా తనే రంగంలోకి దిగారు తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి. గత నాలుగు రోజులుగా విస్తారంగా కురుస్తున్న వర్షాలకు కొన్ని ప్రాంతాలలో వర్షపు నీరు ఇళ్లు, దుకాణ సముదాయాలలోనికి చేరిపోయింది. దీంతో యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని కార్పొరేషన్ సిబ్బంది. ఎన్డీఆర్ఎఫ్ బృందాలకు తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి సూచించారు. భూమన కరుణాకరరెడ్డి స్వయంగా కార్పొరేషన్ అధికారులను వెంట పెట్టుకొని తిరుపతి రూరల్ పరిధిలోని పూలవాని గుంట, రేణిగుంటకు వెళ్ళే ప్రధాన రహదారి వెంబడి నిలిచిపోయిన వర్షపు నీరును వెంటనే తొలగించాలని అధికారులకు సూచించారు. కొన్ని లోతట్టు ప్రాంతాలు మాత్రమే వర్షాల కారణంగా జలమయంగా మారాయని, కొన్ని ఇళ్లలోకి వరద నీరు కూడా రావడం జరిగిందని, వరద బాధితులకు సహాయక చర్యలు చేపట్టడం జరుగిందన్నారు. తామంతా అప్రమత్తంగా ఉంటూ ఎప్పటికప్పుడు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టడం జరుగుతోందన్నారు. గతానుభవాల దృష్ట్యా
ముందస్తు చర్యలు చేపట్టడంతో వరద ఉదృతి, నష్ట ప్రభావం తగ్గిందని. గతంతో పోల్చితే వరద ముప్పును తగ్గించినట్టేనని భావించాలన్నారు. తిరుపతి నగర కమిషనర్ హరిత, తహశీల్దార్ వెంకట రమణ ఆధ్వర్యంలో ఎప్పటికప్పుడు పరిస్థితులను పరిశీలిస్తూసహాయక చర్యలు కొనసాగిస్తున్నారు ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి.
Read Also..
Read Also..