సనాతనధర్మం మనిషి ఆచరించాల్సిన కొన్ని విధులను వివరించింది. వాటిలో సంప్రదాయకంగా ఆచరించాల్సిన ధర్మం… మనవతా ధర్మంతో చేయాల్సిన దానం. మనపురాణాల ప్రకాతం అష్ట మహాదానాలకు విశేషమైన ప్రాధాన్యత ఉంది. గరుడపురాణం ఎనిమిదో అధ్యాయంలో ఈ దానాల గురించి విపులంగా వివరించారు. నువ్వులు, ఇనుము, బంగారం, పత్తి, ఉప్పు, భూమి, ఆవులను దానంగా ఇవ్వవచ్చు. ఇక ఎనిమిదో దానం ఎంటంటే విశేష ధాన్య దానం. ఇందులో ఏడు ధాన్యాలను చేర్చారు. గోధుమలు, కందులు, పెసలు, శనగలు, బొబ్బర్లు, మినుములు, ఉలవలు ఉన్నాయి. వీటిలో ఏదైనా ఒకటిని లేదా అన్నింటినీ దానంగా ఇవ్వవచ్చు. మనం అనుభవిస్తున్న కష్టాలు..నష్టాలు, ఇబ్బందులు.. ఆర్ధిక సమస్యల తీవ్రతను బట్టి మనం చేయాల్సిన దానం ఏదో నిర్ణయించుకోవచ్చు. నవగ్రహాల దోషనవారణకు మనం ఎక్కువగా నవధాన్యాలను దానం చేయటం జరుగుతుంది. వీటిలో నువ్వులకు చాలా ప్రత్యేక స్థానం వుంది. ఇవి శ్రీ మహావిష్ణువు స్వేదం నుంచి ఉద్భవించాయి. నువ్వుల్లో మూడు రకాలుంటాయి. వీటిలో ఏది ఇచ్చినా ఉత్తమ ఫలితాలుంటాయి. ఇనుమును దానం చేయడం అనేది చాలా మందికి తెలియదు. కానీ ఇది ఎంతో ప్రశస్థమైనది. శని గ్రహదోష నివారణకు, అపమృత్యుదోష నివారణకు తప్పకుండా ఇనుము దానం చేయాలి. అయితే దీనిని దానంగా సంతోషంతో తాసుకునే వారు వుండాలి. ఈ దానం ద్వారా యమలోకానికి వెళ్ళకుండా ఉండవచ్చని శాస్త్రం తెలుపుతోంది. యముడు ఇనుముతో చేసిన ఆయుధాలు ధరించి ఉంటాడు. దీంతో ఇనుము దానం చేసిన వారు యమలోకానికి వెళ్ళరు. ఇఖ అత్యంత విలువైన లోహం బంగారం. సువర్ణదానం బ్రహ్మాదిదేవతలు, మునీశ్వరులు సంతోషించేందుకు దోహదపడుతుంది. గురుగ్రహ దోషం వున్నా దీనితో తొలగిపోతుంది. పత్తిని దానం చేయడం ద్వారా యమ భటుల భయం ఉండదు. దీనిద్వారా చంద్ర గ్రహదోషం తొలగిపోతుంది. అలాగే ఉప్పును దానం చేస్తే యమధర్మరాజు అనుగ్రహిస్తాడు. మనకు వున్న ప్రతికూల , నకారాత్మక శక్తులు మననుంచి తొలగిపోతాయి. భూమిని దానం చేస్తే సమస్త భూతాలు సంతృప్తి చెందుతాయి. తీవ్ర కుజుదోషం వున్నవారు భూదనంతో వారి కుజగ్రహదోషాన్ని తొలగించుకోవచ్చు. గోదానంతో భయంకరమైన వైతరిణి నదిని దాటిపోవచ్చు. ఎనిమిదో దానంలోని ఏడు ధాన్యాలను దానం చేయడం ద్వారా యముడి నివాసానికి రక్షణగా ఉండేవారు ఆనందిస్తారు. ఈ దానాల్లో కొన్నింటిని సామాన్యులు కూడా చేయవచ్చు. ఉప్పు, నువ్వులు, ధాన్యాలు, పత్తిని దానం చేయవచ్చు. ఈ దానాలను చేయడం వెనుక ముఖ్యవుద్దేశ్యం… లేని వానికి మనకు ఉన్నంతలో ఎంతో కొంత ఆదుకోడమే అని చెప్పవచ్చు.
అష్ట మహాదానాలు….!!
99
previous post