ఆలయాలకు వెళ్ళినప్పుడు దైవదర్శనం తర్వాత తీర్థ ప్రసాదాలు అందిస్తుంటారు. ఈ తీర్థాన్ని చాలా పవిత్రంగా చూస్తారు. అందుకే పూజారి తీర్థం చేతిలో వేయగానే కళ్లకు అద్దుకుని తీసుకుంటాం. అయితే పవిత్రమైన తీర్థాన్ని తీసుకునేందుకు కొన్ని నియమాలు ఉన్నాయి. తీర్థంలో పంచామృతాలు, తులసీదళాలు, సుగంధ ద్రవ్యాలు, మంత్ర శక్తి ఉంటాయి. పరమ పవిత్రంగా తయారు చేసిన తీర్థాన్ని కేవలం ఒక్కసారి తీసుకోకూడదు. మూడుసార్లు తీసుకోవాలి. కుడి చేతి కింద ఎడమ చేతిని ఉంచి తీర్థం తీసుకోవాలి. ఆ సమయంలో అకాల మృత్యు హరణం సర్వవ్యాధి నివారణం అంటూ మంత్రాన్ని జపించాలి. ఇలా చేయడం వల్ల ఆరోగ్యం, ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుందని పండితులు చెబుతున్నారు. తీర్థాన్ని తీసుకున్న తర్వాత చాలామంది చేతిని తలకు తుడుచుకుంటారు. ఇది సరైన పద్ధతి కాదు. ఎందుకంటే తలపై బ్రహ్మ దేవుడు ఉంటాడు. తీర్థాన్ని సేవించినప్పుడు మన చేయి ఎంగిలి అవుతుంది. కాబట్టి ఎంగిలిని బ్రహ్మదేవుడికి అర్పించినట్లు అవుతుంది. అందుకే తీర్థం తీసుకునే ముందు కళ్ళకు అద్దుకుంటే పర్లేదు కానీ తీర్థం తీసుకున్నాక చేతిని తలకు రుద్దకూడదు.
గుడిలో తీర్థం తీసుకున్న తర్వాత ఇలా చేస్తున్నారా..!
92
previous post