అర్చకులు అజయ్ త్రిపాఠి మాట్లాడుతూ షిరిడి సాయిబాబా 1835 లో లోకంలోకి అడుగుపెట్టినట్లు చరిత్ర చెబుతుందన్నారు. బాబా తన 16 వేట మొదటిసారిగా మహారాష్ట్రలోని అహ్మదాబాద్ కు వచ్చారని, వేప చెట్టు కింద ఆసనం వేసి లోతైన ధ్యానం లో మునిగిన బాబాను చూసి ప్రజలు ఆశ్చర్యపోయారన్నారు. బాబా అనంతరం ఓ మసీదులో ఉంటూ పూజలు నిర్వహించేవారని , బాబా యొక్క మహిమ విభూది ద్వారా ప్రపంచానికి వ్యాపించిందన్నారు. నీటితో దీపాలను వెలిగించి బాబా తన మహిమను ప్రజలకు చూపించారని, ఎందరో రోగులకు వ్యాధి నయం చేసి, భక్తుల చేత ఆరాధింపబడ్డారన్నారు. శ్రీ షిరిడి సాయినాధునికి కులమతాలకు అతీతంగా నాడు భక్తులు విశ్వసించే వారని, నేట్కి బాబా భక్తులు సర్వమత సమ్మేళనం పాటిస్తున్నారన్నారు. బాబా ఏనాడు తాను భగవంతుడిని అంటూ ప్రకటించుకోలేదని, కేవలం గురువుగా గుర్తించబడెందుకు ప్రయత్నించే వారన్నారు. నిశ్చలమైన భక్తితో బాబాను పూజిస్తే చాలు కోరిన కోరికలు తీరుతాయని, నేటికీ ఎందరో భక్తులు బాబాను విశ్వసిస్తూ బాబా విభూదిని స్వీకరిస్తున్నారన్నారు. ఒంగోలులోని లాయర్ పేటలో శ్రీ శిరిడి సాయినాధుని ఆలయంలో భక్తులు ప్రతిరోజు బాబాకు హారతులు ఇచ్చే సమయంలో అధిక సంఖ్యలో హాజరవుతారని, బాబాను ప్రతిరోజు ప్రత్యేక పూలతో భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో అలంకరిస్తారన్నారు. బాబా అనే నామం పలికినా చాలు చీకటి లోన సైతం బాబా దీపం వలే దారిని చూపుతారని, అంధకారమైన జీవితాలను బాబా తన వెలుగులతో అంధకారాన్ని తొలగిస్తారన్నారు.
Read Also..