ఇటీవల కాలంలో ట్రైలర్, సాంగ్స్ సినిమా సక్సెస్ ని ముందే చెప్పే స్తున్నాయి. అలాంటి హిట్ సాంగ్స్ తో ఇప్పటికే టాలీవుడ్ లో మంచి బజ్ క్రియేట్ చేసిన సౌండ్ పార్టీ
చిత్రం ట్రైలర్ గురువారం విడుదలైంది. రెండున్నర నిమిషాల నిడివిగల ఈ ట్రైలర్ మొదటి నుండి ఎండింగ్ వరకు అదిరిపోయే పంచు డైలాగ్స్ తో ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా హీరో వీజే సన్ని, శివన్నారాయణ కు మధ్య వచ్చే డైలాగ్స్ క్రేజీ గా ఉంటూ యూత్ ని ఎట్రాక్ట్ చేస్తున్నాయి. అందుకు మచ్చుతునకే “ప్రస్తుతం యూత్ అంతా జియో , ఓయో మీదే నడుస్తోంది అంటూ శివన్నారాయణ చెప్పిన డైలాగ్. వీరితో పాటు ఇందులో సప్తగిరి, థర్టీ ఇయర్స్ పృధ్వీ ఇంకా ప్రస్తుతం టాలీవుడ్ లో మంచి కమెడియన్స్ పేరు తెచ్చుకున్న వాళ్లంతా ఈ చిత్రంలో కనిపిస్తున్నారు. మోహిత్ రెహమానికి మ్యూజిక్ , శ్రీనివాస రెడ్డి సినిమాటోగ్రఫీ బాగా కుదిరినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ప్రస్తుతం ఫ్యామిలీ అండ్ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ చిత్రాలను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు ..ఇవ్వన్నీ దృష్టిలో పెట్టుకుని దర్శకుడు సింగిల్ లైన్ పంచ్ డైలాగ్స్ తో, మంచి కాస్టింగ్స్ తో అన్ని వర్గాల ప్రేక్షకులను టార్గెట్ చేస్తూ సౌండ్ పార్టీ చిత్రాన్ని ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తీర్చి దిద్దినట్లు ట్రైలర్ చెప్పకనే చెబుతోంది.
ఫుల్ మూన్ మీడియా ప్రొడక్షన్స్ పతాకంపై ప్రొడక్షన్ నెం-1గా రూపొందిన సౌండ్ పార్టీ
చిత్రంలో వీజే సన్నీ, హ్రితిక శ్రీనివాస్ జంటగా నటించారు. రవి పోలిశెట్టి, మహేంద్ర గజేంద్ర, శ్రీ శ్యామ్ గజేంద్ర నిర్మాతలు. జయ శంకర్ సమర్పణ. సంజయ్ శేరి దర్శకుడు. ఇప్పటికే సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు రేకెత్తించిన ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా ఈనెల 24న గ్రాండ్ గా థియేటర్లలో విడుదలకు సిద్ధమైంది.
శివన్నారాయణ, అలీ, సప్తగిరి, థర్టీ ఇయర్స్ పృథ్వి, ‘మిర్చి’ ప్రియ, మాణిక్ రెడ్డి, అశోక్ కుమార్, కాదంబరి కిరణ్, ‘జెమిని’ సురేష్, భువన్ సాలూరు, ‘ఐ డ్రీమ్’ అంజలి, ఇంటూరి వాసు, చలాకి చంటి, ప్రేమ్ సాగర్, ఆర్.జె. హేమంత్, శశాంక్ మౌళి, త్రినాధ్, కృష్ణ తేజ తదితరులు నటిస్తోన్న ఈ చిత్రానికి డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ : శ్రీనివాస్ రెడ్డి, ఎడిటర్ : జి. అవినాష్ ; సంగీతం: మోహిత్ రెహమానిక్ ; ప్రొడక్షన్ డిజైనర్ : రాజీవ్ నాయర్ ; కో – రైటర్స్ : పటేల్ నందుర్క, సుందర్ పాలుట్ల ; లిరిక్స్ : పూర్ణ చారి ; చీఫ్ కో-డైరెక్టర్ : చిన్న ; కో-డైరెక్టర్ : బి. సంతోష్ కృష్ణ ; అసోసియేట్ డైరెక్టర్స్ : యశ్వంత్ వలబోజు, కృష్ణ చైతన్య. టి ; అసిస్టెంట్ డైరెక్టర్స్ : యష్, దిలీప్ కుమార్ రాజు, యువన్ ఫణీంద్ర. యస్ ; పి. ఆర్. ఓ. : జీ కె మీడియా ; లైన్ ప్రొడ్యూసర్ : శివకాంత్ వంగ ; ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : భువన్ సాలూరు. నిర్మాతలు : రవి పోలిశెట్టి, మహేంద్ర గజేంద్ర, శ్రీ శ్యామ్ గజేంద్ర ; సమర్పణ : జయశంకర్ ; రచన – దర్శకత్వం : సంజయ్ శేరి.