భారతీయ సాంప్రదాయాల్లో పసుపు వాడకానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. యాంటిబయోటిక్ గా వాడే పసుపును ప్రతిరోజు చిటికెడు వాడడం వలన ఎన్నో ఆరోగ్యప్రయోజనాలు ఉన్నాయి. శ్వాసకోశ సమస్యలతో పాటు క్యాన్సర్ లాంటి వ్యాధులకు కూడా ఇది పనిచేస్తుంది. టైప్ -2 డయాబెటిస్ చికిత్సలో పసుపు దివ్య ఔషధంగా పనిచేస్తుంది. శరీరంలో వాపులు రాకుండా నిరోధిస్తుంది …అదేవిటంగా చెక్కెర స్థాయిలను కూడా నియంత్రిస్తుంది. దీంతో టైప్ -2 డయాబెటిస్ చాలా వరకు నియంత్రణలో ఉండే అవకాశం ఉంది. సాధారణ గాయాలతో పాటు బ్లీడింగ్ సమస్యను తగ్గించడంలోనూ పసుపు బాగా పనిచేస్తుంది. యాంటీ ఆక్సిడెంట్ ,యాంటీ క్యాన్సర్ గుణాలు కలిగి ఉంది టిష్యు రిపేర్ కు వికూడా దోహదపడుతుంది. అల్జీమర్స్ లాంటి మెదడు సంబంధ సమస్యలకు కూడా పసుపు ఉత్తమమైన మార్గమని హెల్త్ ఎక్స్పర్ట్స్. ..రోజువారీ పనులతో అలసిపోయే వాళ్ళతో పాటు ఒత్తిడికి గురయ్యేవారికి కూడా పసుపు మంచి ఔషధంగా పనిచేస్తుందని పలు పరిశోధనల్లో తేలింది. శరీరంలో చేదు కొలెస్ట్రాల్ స్థాయుల్ని నియంత్రించడంలోనూ పసుపు ఉపయోగం చాలా ఉంది కాబట్టి ప్రతిరోజు చిటికెడు పసువును ఎదో రకంగా వాడడం మంచిది.
Read Also..
Read Also..