బెస్ట్ రీఫ్రెష్మెంట్ డ్రింక్ ఏది అంటే కచ్చితంగా కొబ్బరి నీళ్లు అనే చెప్పాలి. కేవలం ఎండాకాలం లో మాత్రమే కాకుండా ఏ సీసన్ లో అయినా సరే శరీరానికి కావాల్సిన డీహైడ్రేషన్, ఎండ వేడిమి తగ్గడమే కాదు.. అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని నిపుణులు అంటున్నారు. నిస్సత్తువను తరిమికొట్టే.. కొబ్బరినీళ్లు తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. కొబ్బరి నీళ్లలో 94 శాతం నీరు ఉంటుంది, కొవ్వు చాలా తక్కువగా ఉంటుంది. 250 ml కొబ్బరి నీటిలో 9 గ్రాముల పిండి పదార్థాలు, 3 గ్రాముల ఫైబర్, 2 గ్రాముల ప్రోటీన్, 10 శాతం – విటమిన్ సి, 15 శాతం – మెగ్నీషియం, 17 శాతం – మాంగనీస్, 17 శాతం – పొటాషియం, 11 శాతం సోడియం, 6 శాతం కాల్షియం ఉంటాయి. కొబ్బరి నీళ్లలో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది మీ శరీరం నుంచి అదనపు నీటిని,వ్యర్థ పదార్థాలను తొలగిస్తుంది. కొబ్బరి నీళ్లలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి కాలేయాన్ని ఆరోగ్యం గా ఉంచుతాయి. కొబ్బరినీళ్లు మలబద్దకాన్ని దూరం చేస్తాయి. జీర్ణ శక్తిని కూడా పెంచుతాయి. కొబ్బరి నీళ్లలో ఎలెక్ట్రోలైట్స్,విటమిన్లు అధికంగా ఉంటాయి. కొబ్బరి నీళ్లలో ఉండే ఆల్కలైన్ గుణాలు ఎసిడిటీ ని దూరం చేస్తాయి. గర్భిణులు కొబ్బరి నీళ్లు తాగడం వలన విటమిన్ బి9 కడుపులో బిడ్డ ఎదుగుదలకు తోడ్పడుతుంది. ప్రెగ్నెన్సీ సమయంలో ఎక్కువగా వేధించే.. జీర్ణ సమస్యలు తగ్గిపోతాయి.
కొబ్బరి నీరు – దాని ప్రాముఖ్యత
94
previous post