రోజువారీగా యాపిల్స్‌ని వాడే వారిలో పెద్ద పేగు క్యాన్సర్ల ఉనికి తక్కువగా ఉంటుంది. యాపిల్స్‌లో ఉండే పెక్టిన్ జీవక్రియకు లోనైనప్పుడు బ్యుటైరేట్ అనే జీవి రసాయనం విడుదలవుతుంది. ఇది మలాశయం గోడల మీద రక్షణగా పనిచేసి క్యాన్సర్ నుంచి మన శరీరాలను కాపాడుతుంది. యాపిల్ పండు తొక్కులో ఉండే దాదాపు పన్నెండు రకాల రసాయనపదార్థాలు క్యాన్సర్ కణాలను సమర్థంగా అడ్డుకుంటాయని కార్నెల్ యూనివర్సిటీ పరిశోధకుల రీసెర్చిలో తేలింది. ‘ట్రిటర్‌పెనాయిడ్స్’గా వ్యవహరించే ఈ పదార్థాలు కాలేయం, పెద్దపేగు, రొమ్ము క్యాన్సర్లకు సంబంధించిన కణాల పెరుగుదలను అడ్డుకుంటాయట. అంతేకాదు, ధ్వంసమైన క్యాన్సర్ కణాలను శరీరం నుంచి బయటికి పంపించడంలోనూ వీటిది కీలకపాత్ర. తొక్కులోనే కాదు పండులోనూ అనేక రకాల క్యాన్సర్ నిరోధక ఫ్లేవనాయిడ్లూ ఫినోలిక్ ఆమ్లాలూ ఉంటాయి. కాబట్టి తరచుగా యాపిల్ తీసుకొంది.
liver
వారంలో కనీసం మూడు కప్పుల బీన్స్ తినగలిగితే ఆరోగ్యానికి ఎంతో మేలు’ అంటున్నారు. బీన్స్‌లో ఉండే పీచు, యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో తయారయ్యే క్యాన్సర్ కారకాలతో పోరాడతాయి. గుండె ఆరోగ్యానికెంతో మేలు చేస్తాయి. కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్లు పెరగకుండా చూస్తాయి. సన్నబడాలని డైటింగ్ చేసే వాళ్లూ బీన్స్‌ని తినేయొచ్చు. అరకప్పు బీన్స్‌లో ఏడు గ్రాముల ప్రొటీన్లు లభ్యమవుతాయి. అంటే ముప్ఫై గ్రాముల చికెన్, మటన్‌లో లభించే పోషకాలతో సమానం అన్నమాట. వీటిని కూరల్లోనే కాదు సూపులూ, ఇతర టిఫిన్ల తయారీలోనూ ఉపయోగించవచ్చు. బీ కాంప్లెక్స్‌లోని ఎనిమిది రకాల విటమిన్లూ బీన్స్‌లో లభిస్తాయి. ఉడికించిన తరవాత కూడా వీటిలోని డెబ్భై శాతం పోషకాలు మిగిలే ఉంటాయి. కాలేయం, చర్మం, కళ్లు, వెంట్రుకలు లాంటి అనేక భాగాలకు వీటినుంచి శక్తి అందుతుంది.
బెస్ట్ రీఫ్రెష్మెంట్ డ్రింక్ ఏది అంటే కచ్చితంగా కొబ్బరి నీళ్లు అనే చెప్పాలి. కేవలం ఎండాకాలం లో మాత్రమే కాకుండా ఏ సీసన్ లో అయినా సరే శరీరానికి కావాల్సిన డీహైడ్రేషన్, ఎండ వేడిమి తగ్గడమే కాదు.. అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని నిపుణులు అంటున్నారు. నిస్సత్తువను తరిమికొట్టే.. కొబ్బరినీళ్లు తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. కొబ్బరి నీళ్లలో 94 శాతం నీరు ఉంటుంది, కొవ్వు చాలా తక్కువగా ఉంటుంది. 250 ml కొబ్బరి నీటిలో 9 గ్రాముల పిండి పదార్థాలు, 3 గ్రాముల ఫైబర్, 2 గ్రాముల ప్రోటీన్, 10 శాతం – విటమిన్ సి, 15 శాతం – మెగ్నీషియం, 17 శాతం – మాంగనీస్, 17 శాతం – పొటాషియం, 11 శాతం సోడియం, 6 శాతం కాల్షియం ఉంటాయి. కొబ్బరి నీళ్లలో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది మీ శరీరం నుంచి అదనపు నీటిని,వ్యర్థ పదార్థాలను తొలగిస్తుంది. కొబ్బరి నీళ్లలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి కాలేయాన్ని ఆరోగ్యం గా ఉంచుతాయి. కొబ్బరినీళ్లు మలబద్దకాన్ని దూరం చేస్తాయి. జీర్ణ శక్తిని కూడా పెంచుతాయి. కొబ్బరి నీళ్లలో ఎలెక్ట్రోలైట్స్,విటమిన్లు అధికంగా ఉంటాయి. కొబ్బరి నీళ్లలో ఉండే ఆల్కలైన్ గుణాలు ఎసిడిటీ ని దూరం చేస్తాయి. గర్భిణులు కొబ్బరి నీళ్లు తాగడం వలన విటమిన్ బి9 కడుపులో బిడ్డ ఎదుగుదలకు తోడ్పడుతుంది. ప్రెగ్నెన్సీ సమయంలో ఎక్కువగా వేధించే.. జీర్ణ సమస్యలు తగ్గిపోతాయి.
బీట్రూట్, క్యారేట్ ఎక్కువగా తినాలి. పాలకూర,టమాటాలు తినాలి. నిమ్మకాయతో పాటు విటమిన్ సి ఉండే ఆహారం తీసుకోవాలి. క్యాబేజీ ,వాల్ నట్స్,అవకాడోలు తినాలి. వెల్లుల్లి,యాపిల్స్ తినాలి. ఆలివ్ ఆయిల్ తో చేసిన వంటకాలు తినాలి. గ్రీన్ టీ ఎక్కువగా తాగాలి. వీటిని నిత్యం తెసుకోవడం తో లివర్ లోని విష పదార్ధాలు తొలిగిపోయీ దాని పనితీరు మెరుగుపడుతుంది.





Total views : 75253