బార్లీని కాల్షియం పదార్థాలతోను, చిక్కుళ్లు, మాంసం, పాలు, కోడిగుడ్లు వంటి వాటితో కలిపి తీసుకుంటే మంచిది. వీటిని కలిపి తీసుకోవటం ద్వారా బార్లీలో లేని లైసిన్‌ని భర్తీచేసినట్లవుతుంది. బార్లీలో జిగురు ఎక్కువ కనుక గ్లూటెన్ పదార్థాలతో ఎలర్జీ కలిగినవారు బార్లీని తీసుకోకూడదు. బార్లీని గాలి చొరబడని, తేమలేని డబ్బాల్లో చల్లగా, చీకటిగా, పొడిగా ఉండే జాగాలో నిల్వచేస్తే పోషక తత్వాలు దెబ్బతినకుండా కొన్ని నెలలపాటు తాజాగా ఉంటాయి. బార్లీకి నీళ్లు కలిపి ఉడికించినప్పుడు దానిలోని స్టార్చ్ రేణువులు నీటిని పీల్చుకొని మెత్తబడి ఉబ్బుతాయి. బార్లీని 140 డిగ్రీల ఫారిన్ హీట్‌కి మించి వేడి చేస్తూపోతే స్టార్చ్ రేణువులు విచ్చేదనం చెంది ఎమైసోడ్ ఎమైలోపెక్టిన్లు చుట్టుపక్కలకు తప్పించుకొని నీటి రేణువులు తమలో కలిపేసుకుంటాయి. ఈ కారణం చేతనే పల్చని సూప్‌కి బార్లీగింజలను కలిపితే చిక్కగా తయారవుతుంది. బార్లీలో ఉండే విటమిన్-బి నీటిలో కరిగే తత్వం కలిగినది. దీనిని వృధాగా పోనివ్వకూడదనుకుంటే బార్లీగింజలను, వాటిని వేసి ఉడికించిన నీళ్లతో సహా తీసుకోవాలి. పియర్లింగ్ అనే ప్రక్రియలలో, బార్లీగింజలపైనుండే పొరను తొలగిస్తారు. బార్లీగింజలను పిండిగా మరాడించినప్పుడు పైనుండే ఊకను లేదా తవుడును తొలగిస్తారు. అయితే బి-విటమిన్లు, పీచు పదార్థాలు వంటివి అత్యధిక భాగం పై పొట్టులోనే ఉంటాయి కాబట్టి బి విటమిన్ కావాలనుకునేవారు బార్లీగింజలను యధాతథంగా వాడగలిగితేనే మంచిది. మాల్టింగ్ అనే ప్రక్రియలో బార్లీ గింజలను మొలకెత్తేలా చేస్తారు. ఈ ప్రక్రియలో సంక్లిష్ట పిండి పదార్థాలు (బీటాగ్లూకాన్స్) షుగర్స్‌గా మారతాయి. ఇలా సిద్ధంచేసిన మాల్టెడ్ బార్లీ గింజలను బీర్, విస్కీ వంటి పులియబెట్టి చేసే పదార్థాల తయారీకి వినియోగిస్తారు. బార్లీని నీళ్ళలో నానవేసి రోజూ తాగితే శరీరానికి పట్టిన నీరు తగ్గుతుంది. అలాగే ఒంటికి నీరు చేరిన గర్భిణి స్త్రీలు బార్లీ నీటిని తాగడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇంకా అనారోగ్యంతో బాధపడేవారు ప్రతీరోజూ బార్లీ గంజిని తాగితే బలహీనత, నీరసం తగ్గి నూతన శక్తి లభిస్తుంది. బార్లీని రవ్వలాగా, మెత్తటి పిండిలా చేసి దానితో ఫలహారాలను చేసి తింటే త్వరగా, తేలిగ్గా జీర్ణమవుతాయి. బార్లీ నుండి తీయబడిన నూనెను వాడితే శరీరంలోని కొలెస్టరాల్ శాతం తగ్గుతుంది. బార్లీలో ప్రోటీన్లు, కార్పోహైడ్రేడ్లు, కొవ్వు, విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా లభిస్తాయి. పిల్లలకు ఇచ్చే సూప్‌లలో, పాలలో బార్లీ వాడటం ద్వారా వారి ఎదుగుదలకి ఆరోగ్యానికి, శక్తికి దోహదం చేస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
బార్లీ ఉపయోగాలు..
117
previous post