పసుపులో యాంటీ క్యాన్సర్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. క్యాన్సర్ కారక కణాల పెరుగుదలను ఇది నిరోధిస్తుంది. ప్రతిరోజూ ఆహారం తీసుకున్న 2 గంటల తర్వాత పాలలో కొంచెం పసుపు కలుపుకొని తాగండి. కుంకుమపువ్వు తీసుకోవడం వల్ల క్యాన్సర్ వ్యాధి పెరగకుండా నిరోధిస్తుంది. ఎవరికైనా క్యాన్సర్ ఉంటే అతను పాలు, ఖీర్, పాయసం వంటి ఆహార పదార్థాలతో పాటు కుంకుమపువ్వును తీసుకోవాలి. పాలతో పాటు అంజీర పండ్లను తినడం వల్ల క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు రాకుండా ఉంటాయి. మీరు ప్రతి రోజు రాత్రి నిద్రించే ముందు ఒక అంజీర్ పండును తీసుకోవాలి. పాలలో వేసి ఉడికించి నమిలి తిని పాలు తాగాలి.
milk
బొప్పాయిలో ఉండే కెరోటిన్ విషతుల్యాల్ని తొలగిస్తుంది. దీనివల్ల శరీరం, మనస్సు తేలికపడి ఒత్తిడి ఇట్టే ఒత్తిడి తగ్గిపోతుంది. ఆరెంజ్‌లో అత్యధికంగా కమలాల్లో లభించే సి విటమిన్ వల్ల ఒత్తిడి ఫలితంగా ప్రభావం చూపే హార్మో న్ల స్థాయిని తగ్గించి మేలు చేకూరుస్తుంది. అరటిపండులో ఉండే అధిక క్యాలరీలు, మెగ్నీషియం టెన్షన్‌ను సులభంగా తగ్గిస్తాయి. జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేయడంలో అరటిపండు ఎంతో మేలు. బంగాళ దుంపలో జింక్, విటమిన్ సి పెరిగి రోగని రోధకశక్తి ఇనుమడించి మనస్సును దృఢంగా, ఆరోగ్యంగా ఉంచుతుంది. చాక్లెట్లో సహజంగా ఉండే ఫెనిలెథిలమైన్ ఎండార్ఫిన్ స్థాయిల్ని తొలగించి సహజ సిద్దమైన యాంటీ – డివ్రేస్సెంట్గా పనిచేస్తుంది. యాప్రికోట్‌లోని కెరోటిన్ ఒత్తిడిని తగ్గిస్తుంది. పెరుగులోని విటమిన్ బి నెర్వస్‌నెస్‌ను తగ్గిస్తుంది. గోధుమలో ఉండే ఐరన్ మెదడుకు ఆక్సిజన్‌ను ఇచ్చి ఒత్తిడిని, టెన్షన్‌ను నివారిస్తుంది. ఒమెగా3 ఫ్యాటీయాసిడ్లు అత్యధికంగా లభించే చేపలు స్ట్రెస్‌ను తగ్గిస్తాయి. పాలలోని ల్యాక్టోస్ మంచి నిద్రనిచ్చి మెదడును తాజాగా, చురుకుగా ఉంచేందుకు సహకరిస్తాయి.
Read Also..
Read Also..
శీతాకాలం వచ్చేసింది మరియు తీపి నారింజలను తినడం ద్వారా సీజన్‌ను సద్వినియోగం చేసుకునే సమయం వచ్చింది. నారింజ అత్యంత ఆరోగ్యకరమైన మరియు పోషకమైన శీతాకాలపు పండు అని మనందరికీ తెలుసు. నారింజతో ఏ ఆహారాలు తినకూడదో తెలుసుకోండి. చిన్న, చేదు మరియు జ్యుసి, నారింజ అత్యంత ఇష్టపడే శీతాకాలపు పండ్లలో ఒకటి. మరియు వాటి బహుముఖ రుచి మరియు ఆకృతి కారణంగా, ఈ పండు సాస్‌ల నుండి డెజర్ట్‌లు మరియు పానీయాల వరకు ప్రతిదానికీ బాగా సరిపోతుంది. నారింజలో సిట్రిక్ యాసిడ్ మరియు విటమిన్ సి అధికంగా ఉంటాయి. ఇది రోగనిరోధక శక్తి మరియు జీవక్రియకు గొప్పది, కానీ వాటిని కొన్ని ఆహారాలతో తినడం అజీర్ణం, ఆహార అలెర్జీలు మరియు అసౌకర్యం లేదా గుండెల్లో మంటను కలిగిస్తుంది. సిట్రస్ పండ్లు లేదా జ్యూస్‌లకు పాల ఉత్పత్తులను జోడించడం వల్ల అజీర్ణం లేదా గుండెల్లో మంట వస్తుంది. ఎందుకంటే ఆరెంజ్‌లోని ఆమ్లత్వం పాలలోని ప్రొటీన్లను కరిగించి కడుపు నొప్పికి లేదా ఉబ్బరానికి దారితీస్తుంది. నారింజలో ఆమ్లత్వం పెరుగుతో తినడానికి కొంతమందికి కష్టమవుతుంది. అరటిపండ్లను కమలాపండుతో కలిపి తింటే జీర్ణవ్యవస్థలో లోపాలు ఏర్పడి అజీర్ణం కలుగుతుంది. ముఖ్యంగా కడుపు వ్యాధులతో బాధపడేవారికి ఇది హానికరం. టమోటాలు మరియు నారింజలు రెండూ విటమిన్ సి మరియు అవసరమైన పోషకాలతో నిండి ఉన్నప్పటికీ, రెండు ఆమ్ల ఆహారాలను కలపడం చెడ్డ ఆలోచన కావచ్చు. ఎందుకంటే ఇది యాసిడ్ రిఫ్లక్స్ లేదా జీర్ణ అసౌకర్యానికి దోహదం చేస్తుంది.
పాలు , పెరుగు వంటి డైరీ ఉత్పత్తులలో ” ట్రిప్టోఫాన్ ” ఉంటుంది. ఈ ఎమినోయాసిడ్ స్లీప్ సెరటోనిన్ ఉత్పత్తికి, నిద్రకు సహకరించే మెలటోనిన్ కు , శారీరక అంతర్గత క్లాక్ క్రమబద్దీకరణకు సహకరిస్తుంది. ఆహారములో కాల్షియం లోపము వల్ల నిద్రకు ఆటంకం కలుగుతుంది. ఓట్స్ ట్రిప్టోఫాన్ కు చక్కని సహజ ఆధారము. పడుకునే ముందు వీటిని స్నాక్ గా తీసుకుంటే ప్రశాంతము గా నిద్ర పడుతుంది. అరటిపండు మెగ్నీషియం , పొటాషియం , ఖనిజాలకు అద్భుత ఆధారము. కండరాల క్రాంప్స్ , స్పాసమ్ వంటివి రాత్రివేల రాకుండా సహకరిస్తుంది. బెడ్ టైమ్ తింటే మంచి నిద్ర వస్తుంది. ముఖ్యముగా భారీ ఎక్సర్ సైజ్ సెషన్ తర్వాత అరటి పందు చాలా మంచిది. స్లీప్ ఆప్నియా తో బాధపడుతున్న వారు పడుకునే ముందు అరటి పండు తినాలి. చెర్రీలు మెలటోనిన్ కి సహజ ఆధారము పడుకునే ముందు వీటిని తింటే త్వరితము గా నిద్రపడుతుంది. తాజా చెర్రీలు , చెర్రీ జ్యూస్ మంచి నిద్రకారిణి. అవిసె గింజలు శరీరములో నిద్రను క్రమబద్ధీకరించే ‘ సెరటోనిన్’ స్థాయిలను మెరుగుపరచడము లో బాగా సహకరిస్తుంది. పిండి పదార్థాలతో కూడిన ఆహారం ట్రీప్టోఫాన్ అనే అమైనో ఆమ్లాన్ని మెదడుకు చేరుకునేలా చేసి త్వరగా నిద్రపట్టేలా చేస్తుంది. ప్రోటీన్లతో నిండిన పదార్థాల్లోనూ ట్రీప్టోఫాన్ ఉంటుంది. అందువల్ల ప్రోటీన్లతో పాటు పిండి పదార్థాలనూ తీసుకోవటం నిద్రకు ఉపకరిస్తుంది. కడుపునిండా దండిగా ముఖ్యంగా పిండి పదార్థాలు ఎక్కువగా గల ఆహారం తిన్నప్పుడూ నిద్రమత్తుతో జోగేలా చేస్తుంది.
Read Also..
Read Also..
ప్రొటీన్లు శరీర కణాలు, కండరాలు, ఎముకల నిర్మాణానికి ప్రొటీన్లు అవసరం. ప్రొటీన్లు శరీరానికి శక్తిని అందించడంలో కూడా సహాయపడతాయి. ప్రొటీన్లు ఎక్కువగా ఉండే ఆహారాలు మాంసం, చేపలు, గుడ్లు, పాలు, పప్పులు, ధాన్యాలు. శరీరానికి ప్రధాన శక్తి వనరుగా కార్బోహైడ్రేట్లు ఉంటాయి. కార్బోహైడ్రేట్లు త్వరగా జీర్ణమై రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయి. కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండే ఆహారాలు అన్నం, ఇడ్లీ, ఉప్మా, పప్పులు, పండ్లు, కూరగాయలు. కొవ్వులు కూడా శరీరానికి శక్తిని అందిస్తాయి. కొవ్వులు త్వరగా జీర్ణమవవు, కాబట్టి అవి రక్తంలో చక్కెర స్థాయిలను పెంచవు. కొవ్వులు ఎక్కువగా ఉండే ఆహారాలు నట్స్, సీడ్స్, ఆలివ్ ఆయిల్, గుడ్డు, మాంసం. విటమినలు శరీరంలో జీవక్రియలను సరిగ్గా జరగాలని సహాయపడతాయి. విటమినలు శక్తినిచ్చే ఆహారాలను శరీరం సరిగ్గా జీర్ణం చేసుకోవడంలో సహాయపడతాయి. విటమినలు ఎక్కువగా ఉండే ఆహారాలు పండ్లు, కూరగాయలు, పాలు, మాంసం. ఖనిజాలు కూడా శరీరంలో జీవక్రియలను సరిగ్గా జరగాలని సహాయపడతాయి. ఖనిజాలు శక్తినిచ్చే ఆహారాలను శరీరం సరిగ్గా జీర్ణం చేసుకోవడంలో సహాయపడతాయి. ఖనిజాలు ఎక్కువగా ఉండే ఆహారాలు పండ్లు, కూరగాయలు, పాలు, మాంసం. అలసటను దూరము చేసే ఆహారాన్ని రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా మీరు రోజంతా శక్తివంతంగా ఉండవచ్చు.
పాలు ఆరోగ్యాన్ని ఇస్తాయి. ఇది అందరికీ తెలుగు. పాలవలన బరువు తగ్గడము కూడా సాధ్యమే మధ్య వయసులో పాలు తగినంత తాగుతూ , డి-విటమిన్ సమృద్ధిగా తీసుకునేవారు బరువు తగ్గుతారని నిరూపించబదింది. ఇజ్రాయిల్ పరిశోధకులు భారీ కాయము కలిగిన 300 మంది మీద జరిపిన పరిశోధనా ఫలితం ఇది. వీరి వయసు 45-60 మధ్య ఉంది . ప్రతిరోజూ 2 గ్లాసుల పాలు త్రాగడం తో పాటు పిండి పదార్ధము ఉన్న ఆహారము తక్కువగా తీసుకున్న వీరు 2 ఏళ్ళ కాలములో 5.5 కిలోల బరువు తగ్గడము గమనించారు. అదేసమయము లో ఇతర పద్దతుల ద్వారా బరువు తగ్గేందుకు ప్రయత్నించినవారు కేవలము 3 కిలోల బరువు మాత్రమే తగ్గారు. అందుకే పాలలోని కాల్సియం , విటమిన్ డి-బరువుతగ్గడము లో కీలక పాత్ర వహిస్తాయని పరిశోధనల ద్వారా స్పష్టమైనది .
బార్లీని కాల్షియం పదార్థాలతోను, చిక్కుళ్లు, మాంసం, పాలు, కోడిగుడ్లు వంటి వాటితో కలిపి తీసుకుంటే మంచిది. వీటిని కలిపి తీసుకోవటం ద్వారా బార్లీలో లేని లైసిన్‌ని భర్తీచేసినట్లవుతుంది. బార్లీలో జిగురు ఎక్కువ కనుక గ్లూటెన్ పదార్థాలతో ఎలర్జీ కలిగినవారు బార్లీని తీసుకోకూడదు. బార్లీని గాలి చొరబడని, తేమలేని డబ్బాల్లో చల్లగా, చీకటిగా, పొడిగా ఉండే జాగాలో నిల్వచేస్తే పోషక తత్వాలు దెబ్బతినకుండా కొన్ని నెలలపాటు తాజాగా ఉంటాయి. బార్లీకి నీళ్లు కలిపి ఉడికించినప్పుడు దానిలోని స్టార్చ్ రేణువులు నీటిని పీల్చుకొని మెత్తబడి ఉబ్బుతాయి. బార్లీని 140 డిగ్రీల ఫారిన్ హీట్‌కి మించి వేడి చేస్తూపోతే స్టార్చ్ రేణువులు విచ్చేదనం చెంది ఎమైసోడ్ ఎమైలోపెక్టిన్లు చుట్టుపక్కలకు తప్పించుకొని నీటి రేణువులు తమలో కలిపేసుకుంటాయి. ఈ కారణం చేతనే పల్చని సూప్‌కి బార్లీగింజలను కలిపితే చిక్కగా తయారవుతుంది. బార్లీలో ఉండే విటమిన్-బి నీటిలో కరిగే తత్వం కలిగినది. దీనిని వృధాగా పోనివ్వకూడదనుకుంటే బార్లీగింజలను, వాటిని వేసి ఉడికించిన నీళ్లతో సహా తీసుకోవాలి. పియర్లింగ్ అనే ప్రక్రియలలో, బార్లీగింజలపైనుండే పొరను తొలగిస్తారు. బార్లీగింజలను పిండిగా మరాడించినప్పుడు పైనుండే ఊకను లేదా తవుడును తొలగిస్తారు. అయితే బి-విటమిన్లు, పీచు పదార్థాలు వంటివి అత్యధిక భాగం పై పొట్టులోనే ఉంటాయి కాబట్టి బి విటమిన్ కావాలనుకునేవారు బార్లీగింజలను యధాతథంగా వాడగలిగితేనే మంచిది. మాల్టింగ్ అనే ప్రక్రియలో బార్లీ గింజలను మొలకెత్తేలా చేస్తారు. ఈ ప్రక్రియలో సంక్లిష్ట పిండి పదార్థాలు (బీటాగ్లూకాన్స్) షుగర్స్‌గా మారతాయి. ఇలా సిద్ధంచేసిన మాల్టెడ్ బార్లీ గింజలను బీర్, విస్కీ వంటి పులియబెట్టి చేసే పదార్థాల తయారీకి వినియోగిస్తారు. బార్లీని నీళ్ళలో నానవేసి రోజూ తాగితే శరీరానికి పట్టిన నీరు తగ్గుతుంది. అలాగే ఒంటికి నీరు చేరిన గర్భిణి స్త్రీలు బార్లీ నీటిని తాగడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇంకా అనారోగ్యంతో బాధపడేవారు ప్రతీరోజూ బార్లీ గంజిని తాగితే బలహీనత, నీరసం తగ్గి నూతన శక్తి లభిస్తుంది. బార్లీని రవ్వలాగా, మెత్తటి పిండిలా చేసి దానితో ఫలహారాలను చేసి తింటే త్వరగా, తేలిగ్గా జీర్ణమవుతాయి. బార్లీ నుండి తీయబడిన నూనెను వాడితే శరీరంలోని కొలెస్టరాల్ శాతం తగ్గుతుంది. బార్లీలో ప్రోటీన్లు, కార్పోహైడ్రేడ్లు, కొవ్వు, విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా లభిస్తాయి. పిల్లలకు ఇచ్చే సూప్‌లలో, పాలలో బార్లీ వాడటం ద్వారా వారి ఎదుగుదలకి ఆరోగ్యానికి, శక్తికి దోహదం చేస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
రాత్రి పడుకునే ముందు గోరు వెచ్చగా పాలు తాగడం వల్ల మీరు ఆరోగ్యంగా ఉండటమే కాకుండా అనేక అనారోగ్యాలకు దూరంగా ఉండగలరు. ప్రతిరోజూ గ్లాసు పాలు తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. కాల్షియం పుష్కలంగా లభిస్తుంది. చలువ చేస్తుంది. ఒంట్లో వేడిమిని దూరం చేస్తుంది. వీటితో పాటు వేడి పాలను తాగితే గొంతు నొప్పి నుంచి ఉపశమనం దొరుకుతుంది. పురుషులు ప్రతిరోజూ రాత్రి ఒక గ్లాసు పాలు తాగితే హార్మోన్లు చురుకుగా పని చేస్తాయి. కనుక రాత్రి నిద్రించే ముందు ఒక గ్లాసు వెచ్చని పాలు తాగడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
Read Also..
Read Also..




Total views : 141035