Tuesday, May 19, 2026
News Navigation
Tuesday, May 19, 2026
News Navigation

Breaking

Tuesday, May 19, 2026
Home Health ముల్లంగి ఆరోగ్య ఉపయోగాలు

ముల్లంగి ఆరోగ్య ఉపయోగాలు

by Satya
radish

ముల్లంగి దుంపలతో ముల్లంగి పులుసు, ముల్లంగి వేపుడు చేసుకోవచ్చును. ఒకటి రెండు వంటకాల్లో తప్ప పెద్దగా ఉపయోగించని ముల్లంగిలో ఎన్నో పోషకాలుంటాయి. మహిళల్ని వేధించే మూత్రాశయ ఇబ్బందులు మొదలుకుని క్యాన్సర్లని కట్టడి చేయడం వరకూ వివిధ సమస్యల్ని నియంత్రించగల శక్తి ముల్లంగి దుంపలకు ఉంది. రోజుకి ఒక కప్పు ముల్లంగిని సలాడ్‌ రూపంలో తీసుకోగలిగితే ‘సి’ విటమిన్‌ పుష్కలంగా అందుతుంది. తెల్లరక్తకణాలూ వృద్ధి చెంది, వ్యాధినిరోధక శక్తీ పెరుగుతుంది. జలుబూ, దగ్గూ లాంటి సమస్యలూ దరిచేరకుండా ఉంటాయి. దీనికుండే ఒక రకం ఘాటు గొంతు సమస్యల నుంచి ఉపశమనాన్ని అందిస్తుంది. అధిక కఫాన్ని నియంత్రిస్తుంది. రక్తంలోని వ్యర్థాలను తొలగించి రక్తానికి తగినంత ఆక్సిజన్‌ని అందించి కాలేయంపై భారం పడకుండా చేస్తుంది. ముల్లంగిని తరచూ తినే వారిలో కామెర్ల వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. శరీరంపై ఏర్పడే తెల్లని మచ్చలను నియంత్రించడంలోనూ ఇవి చక్కగా పనిచేస్తాయి. ముల్లంగిలో పొటాషియం అధికంగా ఉంటుంది. ఆహారంలో తగినంత పొటాషియం ఉంటే రక్తప్రసరణ సాఫీగా సాగుతుంది. అందుకే అధిక రక్తపోటుతో బాధపడే వారు ముల్లంగిని తరచూ తీసుకోవాలి. మధుమేహ వ్యాధిగ్రస్తులు రోజువారీ ఆహారంలో దీనిని చేర్చుకొంటే రక్తంలో ఒక్కసారిగా గ్లూకోజ్‌ స్థాయిలు పెరిగిపోవడం, తగ్గిపోవడం వంటి ఇబ్బందులు ఎదురుకాకుండా ఉంటాయి.

Advertisements

You may also like

Our Visitor

014675
Total views : 80777

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.