Saturday, August 15, 2026
News Navigation
Saturday, August 15, 2026
News Navigation

Breaking

Saturday, August 15, 2026
Home Sports 15 ఏళ్ల వయసులో ఐపీఎల్‌ను శాసించిన వైభవ్.

15 ఏళ్ల వయసులో ఐపీఎల్‌ను శాసించిన వైభవ్.

by CVR NEWS
15 ఏళ్ల వయసులో ఐపీఎల్‌ను శాసించిన వైభవ్

భారత క్రికెట్‌కు మరో అద్భుతమైన యువ సంచలనం దొరికింది. కేవలం 15 ఏళ్ల వయసులోనే వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్-2026 సీజన్‌ను తన పేలవమైన కాదు, పేలుడు బ్యాటింగ్‌తో ఏకంగా శాసించాడు. రాజస్థాన్ రాయల్స్ తరఫున బరిలోకి దిగిన ఈ యువ ఆటగాడు రికార్డుల వర్షం కురిపిస్తూ ప్రపంచ క్రికెట్ దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు. సీజన్ ముగింపు వేడుకలో వైభవ్ ఏకంగా ఐదు ప్రతిష్టాత్మక వ్యక్తిగత అవార్డులను సొంతం చేసుకుని చరిత్ర సృష్టించాడు. ఆరెంజ్ క్యాప్, మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ , ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్, సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ది సీజన్, సూపర్ సిక్సెస్ అవార్డులను కైవసం చేసుకుని ఐపీఎల్ చరిత్రలో అరుదైన ఘనత సాధించాడు.
ఈ సీజన్‌లో 16 ఇన్నింగ్స్‌ల్లో 776 పరుగులు సాధించిన వైభవ్, ఐపీఎల్ చరిత్రలో ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్న అత్యంత పిన్న వయస్కుడిగా నిలిచాడు. 237.31 స్ట్రైక్ రేట్‌తో ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడిన అతడు, ఒకే సీజన్‌లో 72 సిక్సర్లు బాదుతూ కొత్త రికార్డు నెలకొల్పాడు. 400, 500, 600 పరుగుల మైలురాళ్లను అత్యంత వేగంగా చేరుకున్న యువ ఆటగాడిగానూ గుర్తింపు పొందాడు.వైభవ్ ఆటతీరును చూసి క్రికెట్ దిగ్గజాలు సైతం ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అతని బ్యాటింగ్‌లో కనిపిస్తున్న ధైర్యం, పరిణతి, దూకుడు భారత క్రికెట్ భవిష్యత్తుపై ఆశలు పెంచుతున్నాయి. అవార్డుల అనంతరం స్పందించిన వైభవ్ “ఈ సీజన్‌లో నాకు అండగా నిలిచిన రాజస్థాన్ రాయల్స్ సీనియర్ ఆటగాళ్లు, కోచింగ్ సిబ్బంది, సపోర్ట్ స్టాఫ్‌కు ఎప్పటికీ రుణపడి ఉంటాను” అంటూ కృతజ్ఞతలు తెలిపాడు.చిన్న వయసులోనే అసాధారణ ప్రతిభతో మెరిసిపోతున్న వైభవ్ సూర్యవంశీ, భారత క్రికెట్‌కు మరో సూపర్ స్టార్‌గా అవతరించే దిశగా దూసుకుపోతున్నాడనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: