Monday, May 18, 2026
News Navigation
Monday, May 18, 2026
News Navigation

Breaking

Monday, May 18, 2026
Home Health నిద్రకు సహకరించే ఆహారపదార్ధములు

నిద్రకు సహకరించే ఆహారపదార్ధములు

by Satya
sleep

పాలు , పెరుగు వంటి డైరీ ఉత్పత్తులలో ” ట్రిప్టోఫాన్‌ ” ఉంటుంది. ఈ ఎమినోయాసిడ్ స్లీప్ సెరటోనిన్‌ ఉత్పత్తికి, నిద్రకు సహకరించే మెలటోనిన్‌ కు , శారీరక అంతర్గత క్లాక్ క్రమబద్దీకరణకు సహకరిస్తుంది. ఆహారములో కాల్షియం లోపము వల్ల నిద్రకు ఆటంకం కలుగుతుంది. ఓట్స్ ట్రిప్టోఫాన్‌ కు చక్కని సహజ ఆధారము. పడుకునే ముందు వీటిని స్నాక్ గా తీసుకుంటే ప్రశాంతము గా నిద్ర పడుతుంది. అరటిపండు మెగ్నీషియం , పొటాషియం , ఖనిజాలకు అద్భుత ఆధారము. కండరాల క్రాంప్స్ , స్పాసమ్‌ వంటివి రాత్రివేల రాకుండా సహకరిస్తుంది. బెడ్ టైమ్‌ తింటే మంచి నిద్ర వస్తుంది. ముఖ్యముగా భారీ ఎక్సర్ సైజ్ సెషన్‌ తర్వాత అరటి పందు చాలా మంచిది. స్లీప్ ఆప్నియా తో బాధపడుతున్న వారు పడుకునే ముందు అరటి పండు తినాలి. చెర్రీలు మెలటోనిన్‌ కి సహజ ఆధారము పడుకునే ముందు వీటిని తింటే త్వరితము గా నిద్రపడుతుంది. తాజా చెర్రీలు , చెర్రీ జ్యూస్ మంచి నిద్రకారిణి. అవిసె గింజలు శరీరములో నిద్రను క్రమబద్ధీకరించే ‘ సెరటోనిన్‌’ స్థాయిలను మెరుగుపరచడము లో బాగా సహకరిస్తుంది. పిండి పదార్థాలతో కూడిన ఆహారం ట్రీప్టోఫాన్‌ అనే అమైనో ఆమ్లాన్ని మెదడుకు చేరుకునేలా చేసి త్వరగా నిద్రపట్టేలా చేస్తుంది. ప్రోటీన్లతో నిండిన పదార్థాల్లోనూ ట్రీప్టోఫాన్‌ ఉంటుంది. అందువల్ల ప్రోటీన్లతో పాటు పిండి పదార్థాలనూ తీసుకోవటం నిద్రకు ఉపకరిస్తుంది. కడుపునిండా దండిగా ముఖ్యంగా పిండి పదార్థాలు ఎక్కువగా గల ఆహారం తిన్నప్పుడూ నిద్రమత్తుతో జోగేలా చేస్తుంది.

Read Also..

Read Also..

Advertisements

You may also like

Our Visitor

014304
Total views : 79828

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.