బ్రేక్‌ఫాస్ట్(Breakfast)లో రాగుల(Ragula)ను తినడం వల్ల ఎన్నో రకాల హెల్త్ బెన్ఫిట్స్(Health benefits) వున్నాయి. రాగులలో ప్రొటీన్ పుష్కలంగా ఉంటుంది. ఇది కండరాల పెరుగుదలకు ఎంతగానో దోహదపడుతుందని నిపుణులు చెబుతున్నారు. రాగులలో తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. గ్లైసెమిక్ ఇండెక్స్ (GI) అనేది ఒక ఫుడ్ బ్లడ్‌లో చక్కెర స్థాయిలను ఎంత వేగంగా పెంచుతుందో సూచిస్తుంది. రాగులను షుగర్ పేషెంట్లు తీసుకోవడం వల్ల.. రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
ఇది చదవండి: తిన్న తర్వాత ఐస్‌క్రీం తింటున్నారా..?
రాగులతో చేసిన ఆహార పదార్థాలను మధుమేహం ఉన్నవారు తినడం వల్ల షుగర్ స్థాయిలు అదుపులో ఉంటాయి. రాగులలో కాల్షియం అధికంగా ఉంటుంది. వీటిని రోజూ ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్‌లో యాడ్ చేసుకోవడం వల్ల ఎముకలు, దంతాలు దృఢంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అలాగే ఆస్టియోపోరోసిస్ వచ్చే ప్రమాదం కూడా తగ్గుతుందట. రాగులలో అమైనో ఆమ్లాలు ఎక్కువగా ఉన్నాయి. ఇవి బాడీలో చెడు కొలెస్ట్రాల్ తగ్గించడంలో సహాయపడతాయి. అలాగే వీటిని డైట్లో భాగం చేసుకోవడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి