అన్నం తినే సమయంలో టీవీలు చూడటం, ఫోన్లు చూడటం చాలామందికి ఉండే చెడ్డ అలవాటు. టీవీ చూస్తూ భోజనం చేస్తే 10 సంవత్సరాల్లోపు పిల్లలు స్థూలకాయానికి గురవుతారని తేలింది. మరెన్నో అనారోగ్య సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు. ఈ విషయం తెలిసినప్పటికీ చాలామంది అలాగే చేస్తుంటారు. ఊబకాయం, పొట్ట సమస్యలు, కళ్లు బలహీనమవడంలాంటి సమస్యలు తలెత్తుతాయని వైద్యులు చెబుతున్నారు. సాధారణంగా అన్నాన్ని ఎక్కువ సమయం నమిలి మింగాలి. కానీ టీవీ చూసేటప్పుడు దృష్టి మొత్తం అటే ఉండటంతో ఎంత తింటున్నామనే స్పృహ ఉండదు తెలియకుండా ఎక్కువగా తింటాం. అంతేకాదు తిన్న అన్నాన్ని నమలడం కూడా కష్టమవుతుంది. ఎక్కువ శాతం మింగుతాం. అన్నం త్వరగా నమలకుండా వేగంగా తినేస్తారు. అది జీర్ణమవదు. అజీర్ణం, నొప్పి లాంటి సమస్యలు తలెత్తుతాయి. ఈ అలవాటు ఎక్కువ కాలం అలాగే కొనసాగితే కడుపునకు సంబంధించిన వ్యాధులు కూడా వస్తాయి. రాత్రివేళ ఇలా భోజనం చేయడంవల్ల నిద్రకు భంగం కలుగుతుంది. వాస్తవానికి టీవీ చూస్తున్నప్పుడు ఎవరైనా పరిమితికి మించి తింటుంటారు. రాత్రివేళ భోజనం చేసే సమయంలో కూడా అలాగే చేస్తుంటారు. తీసుకున్న ఆహారం జీర్ణం కావడం చాలా కష్టంగా మారుతుంది. రాత్రి మొత్తం ఈ సమస్య కొనసాగుతుంది. నిద్ర పోవడానికి కూడా ఎక్కువ సమయం పడుతుంది. వెంటనే నిద్ర రాదు. దీనితర్వాత అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. దీన్ని గుర్తుంచుకొని టీవీ చూసే సమయంలో అన్నం తినడం మానేయాలని నిపుణులు సూచిస్తున్నారు.
Read Also..
Read Also..