Thursday, July 9, 2026
News Navigation
Thursday, July 9, 2026
News Navigation

Breaking

Thursday, July 9, 2026
Home Health సంతాన‌లేమితో బాధపడుతున్నారా..! అయితే ఇవి తినండి

సంతాన‌లేమితో బాధపడుతున్నారా..! అయితే ఇవి తినండి

by Satya
Brazil Nuts

న‌ట్స్‌లో ఎన్నో ర‌కాలు ఉన్నాయి. వాటిలో బ్రెజిల్ న‌ట్స్ కూడా ఒక‌టి. సెలెనియం, ఐర‌న్‌, పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం, ఒమేగా-3 ఫాట్టీ యాసిడ్స్, విటమిన్ సి, విట‌మిన్ ఇ, విటిమ‌న్ బి, ప్రోటీన్, యాంటీ ఆక్సిడెంట్స్ ఇలా బోలెడ‌న్ని పోష‌కాలు బ్రెజిల్ న‌ట్స్‌లో నిండి ఉంటాయి. అందుకే ఆరోగ్యానికి బ్రెజిల్ న‌ట్స్ అనేక ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తుంది. రెగ్యుల‌ర్‌గా డైట్‌లో ఈ న‌ట్స్‌ను చేర్చుకుంటే బ‌ల‌హీన‌మైన ఎముక‌లు, కండ‌రాలు బ‌లంగా మార‌తాయి. సంతాన‌లేమితో బాధ ప‌డే దంప‌తుల‌కు బ్రెజిల్ న‌ట్స్ ఒక వ‌రంగా చెప్పుకోవ‌చ్చు. వీటిని ప్ర‌తి రోజు త‌గిన మోతాదులో తీసుకుంటే పురుషుల్లో వీర్య క‌ణాల వృద్ధి జ‌రుగుతుంది. స్త్రీలో గర్భాశయ స‌మ‌స్య‌ల‌ను నివారించి సంతానోత్పత్తిని పెంచుతాయి. అలాగే బ్రెజిల్ న‌ట్స్‌ను తిన‌డం వ‌ల్ల వ్యాధి నిరోధ‌క శక్తి పెరుగుతుంది. దాంతో అనేక వ్యాధిలు మీ ద‌రి దాపుల్లోకి రాకుండా ఉంటాయి. అంతేకాదు, ప్ర‌తి రోజు బ్రెజిల్ న‌ట్స్‌ను తింటే మొటిమ‌లు, మ‌చ్చ‌లు పోయి చ‌ర్మం య‌వ్వ‌నంగా మారుతుంది. థైరాయిండ్ గ్రంథి సక్ర‌మంగా ప‌ని చేస్తుంది. శ‌రీరంలో ప్రోటీన్ కొర‌త ఏర్ప‌డ‌కుండా ఉంటుంది. ఒత్తిడి, ఆందోళ‌న‌, డిప్రెష‌న్ వంటి మాన‌సిక స‌మ‌స్య‌లు త‌గ్గి మెద‌డు షార్ప్‌గా, యాక్టివ్‌గా మారుతుంది. గుండె ఆరోగ్యం మెరుగు ప‌డుతుంది. శ‌రీరంలో అధిక వేడి దూరం అవుతుంది. మ‌ల‌బ‌ద్ధ‌కం స‌మ‌స్య ద‌రి చేర‌కుండా ఉంటుంది.

Advertisements

You may also like

Our Visitor

039077
Total views : 194201

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: