వయసుతో పాటు ముఖంపై ముడతలు రావడం సహజం అయితే వయసుతో సంబంధం లేకుండా ముఖంపై ముడతలు వస్తున్నాయి. చిన్న వయసులో ఉన్నవారు కూడా ముఖంపై ముడతల సమస్యను ఎదుర్కొంటున్నారు. ఒత్తిడి, కాలుష్యం, పోషకాహార లోపం వంటి కారణాలు ముఖంపై ముడతలు వచ్చేలా, చిన్న వయసులోనే వృద్ధాప్యం వచ్చేలా చేస్తున్నాయి. మన ఇంట్లోనే దొరికే వస్తువులతో చిన్న చిన్న చిట్కాలను ఉపయోగించి ముఖంపై ముడతలు పోగొట్టుకోవచ్చని చెబుతున్నారు. ఇక వాటిలో కొన్నింటి గురించి మనం తెలుసుకుందాం. ముఖంపై ముడతలు పోవడానికి కలబంద ఎంతో బాగా ఉపయోగపడుతుంది. కలబంద గుజ్జును పూసుకోవడం వల్ల చర్మం మీద ముడతలు, గీతలు తగ్గుతాయి. కలబందతో కొలాజిన్ ఉత్పత్తి జరిగి చర్మం మృదువుగా మారుతుంది. కలబందలో ఉండే మాయిశ్చరైజింగ్ గుణాలు చర్మం తేమగా, నిగారింపుతో ఉండేలా చేస్తాయి. ముఖంపై ముడతలు పోవడానికి తేనె ఎంతో బాగా ఉపయోగపడుతుంది. తేనెలోని యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఫ్రీ రాడికల్స్ నుంచి చర్మ కణాలను కాపాడతాయి. తేనే చర్మంలో ఉన్న తేమను కాపాడుతుంది. ముఖంపై ముడతలు పోవాలంటే తేనెను అప్లై చేసి కాసేపు ఆరనిచ్చి ఆపై గోరువెచ్చటి నీటితో శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే ముఖంపై ముడతలు తగ్గుతాయి. ముఖంపై ముడతలు పోవడానికి కొబ్బరి నూనె ఎంతో బాగా ఉపయోగపడుతుంది. కొబ్బరి నూనెలో ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. కొబ్బరి నూనె చర్మం హైడ్రేటెడ్ గా ఉంచడానికి, పోషణ అందించడానికి తోడ్పడుతుంది. కొబ్బరి నూనె ముఖానికి మసాజ్ చేసుకొని ఓ గంట పాటు ఉంచి ఆపై నీళ్లతో కడుక్కుంటే చర్మం మృదువుగా మారుతుంది. ముడతలు తగ్గుతాయి.
stress
మన నాడీ వ్యవస్థ ఎంత రిలాక్స్‌గా, ప్రశాంతంగా ఉంటే అంత మంచిది. ఒత్తిడి తగ్గించేందుకు రోజూవారీ జీవితంలో కొన్ని అలవాట్లు చేసుకోవాలి. ఒత్తిడి నుంచి బయటపడేందుకు కొన్ని చిట్కాలు పాటించాలి. అవేంటో ఇప్పుడు చూద్దాం..
- ప్రతిరోజూ కొంత సమయం పాటు లోతైన శ్వాసను ప్రాక్టీస్ చేయడం వల్ల ట్రిగ్గర్లను తగ్గించి, నాడీ వ్యవస్థకు విశ్రాంతిని పొందవచ్చు. యోగా, వ్యాయామం చేయడం వలన ఒత్తిడి నుంచి ఈజీగా బయటపడొచ్చు.
- విటమిన్ సి అధికంగా ఉండే ఆహారం అడ్రినల్ ఆరోగ్యానికి మద్దతు ఇస్తుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది. శరీరానికి శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ గా పని చేస్తుంది.
- ప్రోటీన్, ఫైబర్, మంచి కొవ్వులు అధికంగా ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల ఒత్తిడి, ఆందోళనను ఎదుర్కోవచ్చు. సరైన ఆహారం తింటే శారీరకంగా, మానసికంగానూ శక్తిని పెంచుతుంది.
- సానుకూల ఆలోచనా దృక్పథాన్ని అలవాటు చేసుకోవడం వంటి ప్రాథమిక అలవాట్ల ద్వారా ఒత్తిడికి దూరంగా ఉండవచ్చు. ఇవన్నీ మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సహాయపడతాయి.
నట్స్‌లో ఎన్నో రకాలు ఉన్నాయి. వాటిలో బ్రెజిల్ నట్స్ కూడా ఒకటి. సెలెనియం, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం, ఒమేగా-3 ఫాట్టీ యాసిడ్స్, విటమిన్ సి, విటమిన్ ఇ, విటిమన్ బి, ప్రోటీన్, యాంటీ ఆక్సిడెంట్స్ ఇలా బోలెడన్ని పోషకాలు బ్రెజిల్ నట్స్‌లో నిండి ఉంటాయి. అందుకే ఆరోగ్యానికి బ్రెజిల్ నట్స్ అనేక ప్రయోజనాలను అందిస్తుంది. రెగ్యులర్‌గా డైట్లో ఈ నట్స్‌ను చేర్చుకుంటే బలహీనమైన ఎముకలు, కండరాలు బలంగా మారతాయి. సంతానలేమితో బాధ పడే దంపతులకు బ్రెజిల్ నట్స్ ఒక వరంగా చెప్పుకోవచ్చు. వీటిని ప్రతి రోజు తగిన మోతాదులో తీసుకుంటే పురుషుల్లో వీర్య కణాల వృద్ధి జరుగుతుంది. స్త్రీలో గర్భాశయ సమస్యలను నివారించి సంతానోత్పత్తిని పెంచుతాయి. అలాగే బ్రెజిల్ నట్స్‌ను తినడం వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. దాంతో అనేక వ్యాధిలు మీ దరి దాపుల్లోకి రాకుండా ఉంటాయి. అంతేకాదు, ప్రతి రోజు బ్రెజిల్ నట్స్‌ను తింటే మొటిమలు, మచ్చలు పోయి చర్మం యవ్వనంగా మారుతుంది. థైరాయిండ్ గ్రంథి సక్రమంగా పని చేస్తుంది. శరీరంలో ప్రోటీన్ కొరత ఏర్పడకుండా ఉంటుంది. ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్ వంటి మానసిక సమస్యలు తగ్గి మెదడు షార్ప్‌గా, యాక్టివ్‌గా మారుతుంది. గుండె ఆరోగ్యం మెరుగు పడుతుంది. శరీరంలో అధిక వేడి దూరం అవుతుంది. మలబద్ధకం సమస్య దరి చేరకుండా ఉంటుంది.
చాలామంది విపరీతమైన తలనొప్పితో బాధపడుతూ ఉంటారు. తలనొప్పి తగ్గడం కోసం రకరకాల టాబ్లెట్లను, పెయిన్ కిల్లర్స్ ను వాడుతూ ఉంటారు. అయితే విపరీతంగా భరించలేని తలనొప్పితో బాధపడేవారు ఎక్కువ పెయిన్ కిల్లర్స్ వాడటం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని, అది శరీరానికి ఏమాత్రం మంచిది కాదు అని వైద్యులు చెబుతున్నారు. విపరీతంగా తలనొప్పి బాధిస్తున్నప్పుడు తలనొప్పి నుంచి ఉపశమనం పొందాలంటే ఆ చిట్కాలు ఏమిటో తెలుసుకుందాం. బాగా తలనొప్పి తో బాధపడుతున్న వారు తలనొప్పి నుంచి ఉపశమనం పొందడం కోసం అల్లం ఉపయోగిస్తే మంచిదని చెబుతున్నారు. ఒత్తిడిని, తలనొప్పిని, ఒంటి నొప్పులను తగ్గించడంలో అల్లం రసం బాగా ఉపయోగపడుతుందని అంటున్నారు. అల్లం రసాన్ని కాస్త నిమ్మరసంలో కలిపి తాగితే తలనొప్పి నుంచి ఉపశమనం లభిస్తుందని సూచిస్తున్నారు. అంతేకాదు తలనొప్పి తగ్గాలంటే దాల్చినచెక్క కూడా బాగా ఉపయోగపడుతుందని చెబుతున్నారు. దాల్చినచెక్క పొడిగా చేసి కాస్త నీళ్లలో కలిపి ఆ పేస్ట్ నుదుటిపైన దాల్చినచెక్క పట్టులాగా వేస్తే తలనొప్పి నుంచి ఉపశమనం దొరుకుతుంది. నుదుటికి రాసుకున్న దాల్చినచెక్క పేస్టును అరగంట పాటు ఉంచుకుని ఆ తర్వాత వేడినీళ్లతో కడిగితే తలనొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. తలనొప్పి నివారణ కోసం మసాజ్ కూడా ఒక మంచి మంత్రంలా పనిచేస్తుంది. తలనొప్పి ఎక్కువగా ఉన్నవారు మసాజ్ చేసుకోవడం వల్ల నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. మెడ తల భాగాన్ని నొక్కుతూ మెల్లమెల్లగా మసాజ్ చేసుకోవడం వల్ల రక్త ప్రసరణ పెరిగి రిలాక్స్ అవుతారు. నొప్పి కూడా దూరమవుతుంది. తాజా ద్రాక్ష పండ్లను తీసుకొని జ్యూస్ చేసి తాగడం వల్ల కూడా తలనొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. ఈ జ్యూస్ ను రోజుకు రెండు సార్లు తాగితే మంచి ఫలితం ఉంటుందని చెబుతున్నారు. అయితే డయాబెటిస్ బాధితులు మాత్రం ఈ జ్యూస్ ను తాగకూడదు. మొత్తంగా తలనొప్పి నివారణకు ఈ చిట్కాలను పాటించి ఉపశమనం పొందాలని చెబుతున్నారు.
Read Also..
Read Also..
గంజాయి నుంచీ తీసిన నూనెతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. గంజాయి నూనెను సైంటిఫిక్ రూపంలో CBD అంటారు. నిజానికి గంజాయి మొక్క నుంచీ 104 రకాల రసాయనాల్ని తీస్తారు. వాటన్నింటినీ కలిపి కన్నబినాయిడ్స్ అంటారు. వాటిలో నూనె అనేది ఒకటి మాత్రమే. ఈ గంజాయిని కాన్నబిస్ లేదా మారిజువానా మొక్క అని కూడా అంటారు. CBD వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉండటంతో ఔషధాల తయారీలో దాన్ని ఎక్కువగా వాడుతున్నారు. విపరీతమైన నొప్పి, టెన్షన్లను దూరం చెయ్యడంలో ఈ నూనె బాగా పనిచేస్తోంది. ప్రస్తుతం ప్రపంచంలో చాలా మంది డిప్రెషన్, టెన్షన్, ఒత్తిడి, కంగారు, బిజీ లైఫ్ స్టైల్‌తో జీవిస్తున్నారు. ఈ ఆతృత అనేది సర్వ రోగాలకూ పరోక్ష కారణమవుతోంది. గంజాయి నూనెతో మసాజులు, మర్దనల వంటివి చేసుకుంటే, ఎంతో కూల్‌గా, హాయిగా ఉంటుందనీ, టెన్షన్ల నుంచీ ఉపశమనం కలుగుతుందని పరిశోధనల్లో తేలింది. టెన్షన్ తగ్గేందుకు వాడే మందుల వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ. కాన్సర్‌ను తగ్గించే లక్షణాలు కూడా CBD ఆయిల్లో ఉన్నాయి. సాధారణంగా కాన్సర్ ఉన్నవారికి వికారంగా, వామ్టింగ్ అయ్యేలా ఉంటుంది. మన చర్మంపై మచ్చలు, మొటిమల వంటివి కామన్. అవి జన్యుపరమైన కారణాల వల్ల, బ్యాక్టీరియా వల్ల వస్తుంటాయి. వాటి నుంచీ తప్పించుకోవాలంటే గంజాయి నూనె వాడాలంటున్నారు పరిశోధకులు. ఇందులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు. మొటిమలు, మచ్చల అంతు చూస్తాయి. మతిమరపు లక్షణాలు తగ్గాలంటే ఈ నూనెతో తలకి మసాజ్ చేసుకోవాలి. అల్జీమర్స్, పార్కిన్సన్స్ వంటి వ్యాధుల నుంచీ మనల్ని మనం కాపాడుకోవాలంటే ఈ నూనె బాగా ఉపయోగపడుతుందంటున్నారు. ఆల్రెడీ ఈ వ్యాధులతో బాధపడేవారికి కూడా ఈ నూనె మంచి ఫలితాలు చూపిస్తోందని పరిశోధనల్లో తేలింది. హైబీపీని తగ్గించడంలో కూడా CBD ఆయిల్ బాగా పనిచేస్తోంది. హైబీపీ వల్ల గుండె పోటు వచ్చే ప్రమాదం ఉంటుంది. అందువల్ల బీపీ పెరగకుండా జాగ్రత్త పడాలి. అందుకు ఇలాంటి ఆయిల్స్ రిలాక్స్ ఫీల్ కలిగిస్తూ ఉంటే బీపీ ఆటోమేటిక్‌గా కంట్రోల్లో ఉంటుంది.
ఇప్పుడు దాదాపుగా అందరూ అత్తెసరుతో అన్నం వండుతున్నారు. కానీ ఒకప్పుడు ఇళ్లల్లో గంజి వార్చి అన్నం వండేవారు. గంజిని ఒంపేశాక. పల్లెటూళ్లలో చాలా మంది ఉదయం భోజనంతోపాటే తినేవారు. ఇప్పటికీ చాలా మంది గంజిని ఆహారంగా ఉపయోగిస్తారు. గంజిని ఆహారంగా తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని, అందాన్ని కూడా పెంపొందించుకోవచ్చు అవేంటో చూద్దాం. శరీరాన్ని, మనస్సును రిలాక్స్ చేస్తుంది. గంజి శరీరాన్ని, మనసు ప్రశాంతంగా ఉంచుతుంది. స్నానం చేసే ముందు నీటిలో కాసింత గంజిని కలిపి దాంతో స్నానం చేస్తే సరి. మీరు మరింత ఉత్సాహంగా మారతారు. గంజిలో బోలెడన్ని విటమిన్లు, ఖనిజాలు, అమైనో ఆమ్లాలు ఉంటాయి. ఇది కడుపులో మంట రావడాన్ని తగ్గిస్తుంది. అంతేకాదు కొన్ని రకాల జబ్బులు రాకుండా గంజి తోడ్పడుతుంది. శక్తినిస్తుంది. ఆరోగ్యంగా ఉండాలంటే ఎక్సర్సైజ్ చేయడమే కాదు.. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం కూడా ముఖ్యమే. గంజిలోని కార్బోహైడ్రేట్లు శరీరానికి మరింత శక్తినిస్తాయి. నీరసంగా ఉన్నప్పుడు కాస్త గంజి తాగితే సరి. గంజిలో పోషకాలు విరివిగా ఉంటాయి. ఇది జీర్ణ వ్యవస్థను మెరుగు పరుస్తుంది. మలబద్దకాన్ని దూరం చేస్తుంది. వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నప్పుడు శరీరం పోషకాలను కోల్పోతుంది. అలాంటప్పుడు గంజిని ఆహారంగా తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి. డయేరియాను తగ్గించడమే కాదు ఉదర సంబంధ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి గంజి ఎంతగానో ఉపకరిస్తుంది. డయేరియా బాధిస్తుంటే. తరచుగా గంజి తీసుకోవడం ఉత్తమం. జిమ్‌కెళ్లి తెగ శ్రమిస్తుంటారు. కండలు పెరగడానికి శరీరంలోని అమైనో ఆమ్లాలు సహాయపడతాయి. గంజిలో ఇవి పుష్కలంగా ఉంటాయి. కాబట్టి ఇక నుంచి గంజి తాగి రోజూ ఎక్సర్సైజ్ చేయండి. కండలు పెరగడం ఖాయం. ఆరోగ్యవంతమైన జుట్టు గంజితో ఆరోగ్యాన్నే కాదు అందాన్ని కూడా పెంచుకోవచ్చు. ఒకప్పుడు గంజిని షాంపుగా, హెయిర్ కండీషనర్‌గా వాడేవారు. గంజిని ఉపయోగించడం వల్ల జుట్టు పట్టులా మెరుస్తుంది. గంజిలో ఉండే ఇనోసిటోల్ అనే కార్బోహైడ్రేట్ జుట్టు రాలడాన్ని అరికడుతుంది. గంజిని హెయిర్ మాస్క్‌గా ఉపయోగించడం వల్ల పొడవైన, ఆరోగ్యకరమైన, అందమైన జుట్టు మీ సొంతం అవుతుంది. పొల్యూషన్, జీవనశైలి, ఒత్తిడి కారణంగా చాలా మందికి చిన్న వయసులోనే జట్టు ఊడిపోతుంది. గంజిలోని అమైనో ఆమ్లాలు జుట్టు కుదుళ్లను బలోపేతం చేస్తుంది. లావెండర్ ఆయిల్‌ని కొద్దిగా గంజిలో కలిపి జుట్టుకు పట్టించి పది నిమిషాలు ఆగాక కడిగేస్తే హెయిర్ కండీషనర్‌గా ఉపయోగపడటంతోపాటు చక్కటి సువాసన వస్తుంది. గంజి శరీర ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది. గంజి తాగడం వల్ల జ్వరం తగ్గుముఖం పడుతుంది. ఇంకేం జ్వరం వచ్చినప్పుడు గంజి తాగేయడం మరువకండి. ఆరోగ్యానికే కాదు అందానికి కూడా చర్మాన్ని మృదువుగా ఆరోగ్యంగా ఉంచడంలో గంజి తోడ్పడుతుంది. దీన్ని కాటన్ బాల్‌తో రుద్దడం వల్ల రక్త ప్రసరణ మెరుగవుతుంది. చర్మాన్ని యవ్వనంగా ఉంచుతుంది. చర్మ వ్యాధులను తగ్గిస్తుంది. ముఖంపై గుంతలు ఏర్పడకుండా చూసుకోవచ్చు.
పళ్ళన్నీ ముఖ్యమైనవే అయినా అనాస పండు ప్రత్యేకత కలిగినది. చక్కని రుచి, సువాసన కలిగిన అనాస పండు 85 శాతం నీటిని కలిగి ఉంది. అనాస పండును తింటే మూత్ర పిండాల్లో రాళ్లు కరుగుతాయని ఆహార నిపుణులు తెలుపుతున్నారు. అనాస పండులో విటమిన్ సి అధికంగా ఉంది. దీనివల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. సంతాన సమస్యలతో బాధపడేవారు అనాస తినడం ఎంతో మంచిది. అనాసలో జీర్ణ వ్యవస్థను వృద్ధి చేసే ఆమ్లం ఉంటుంది. ఇది ఆహారం త్వరగా జీర్ణమయ్యేందుకు సహాయపడుతుంది. ఈ పండులో అధికమైన పీచుపదార్థం మలబద్దకానికి మంచి మందుగా పని చేస్తుంది. కడుపు నిండా భోజనం చేసిన తర్వాత చిన్న అనాస ముక్కను తింటే త్వరగా జీర్ణమైపోతుంది. ఆడవారికైతే నెలసరి సక్రమంగా వచ్చేందుకు తోడ్పడుతుంది. అనాస పండును ముక్కలుగా చేసి, తేనెతో కలిపి తింటే శరీరానికి శక్తి మాత్రమే కాదు, మేని ఛాయ కూడా నిగారింపు వస్తుంది. అందాన్ని పెంచుకోవాలంటే అనాస తినండి. ఇది శరీరంపై ఉండే మృతకణాలను నివారించి, చర్మాన్ని యవ్వనంగా ఉంచుతుంది. రోజూ పైనాపిల్ జ్యూస్ తాగినా, తిన్నా ఉల్లాసంగా ఉంటారు. అనాసలోని పొటాషియం రక్త ప్రవాహం సాఫీగా సాగేందుకు దోహదం చేస్తుంది. ఫలితంగా రక్తపోటు అదుపులో ఉంటుంది. అనాస పండు తినడం వల్ల ఒత్తిడి, మతిమరపు, డిప్రెషన్లనీ తగ్గిస్తుంది. పండిన అనాస పండును తింటుంటే పళ్ళ నుండి రక్తంకారే స్కర్వే వ్యాధి రాకుండా రక్షణ కలిగిస్తుంది. గొంతు నొప్పి, నోటిలో పుండ్లు ఉన్నట్లయితే, అనాసరసాన్ని నోటిలో కాసేపు ఉంచుకుని మింగేయండి. తప్పకుండా అవి తొలగిపోతాయి. అనాసపండు రసం పచ్చకామెర్లకు మంచి ఔషధం. అనాస కాలేయానికి, మూత్రపిండాల సమస్యలను నయం చేయడంలో అద్భుతంగా ఉపయోగపడుతుంది. అనాసలోని కాపర్ శరీరంలో ఉన్న ఎర్ర రక్తకణాలను వృద్ధి చేయడానికి సహాయపడుతుంది. అనాసపండులోని మాంగనీస్ ఎముకలు, దంతాలు, కండరాలు, జుట్టు సమస్యలను నివారిస్తుంది.
శారీరకంగా మానసికంగా అలసిపోతున్నారా? అయితే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు…
శారీరకంగా మరియు మానసికంగా అలసిపోయడం అనేది చాలా సాధారణమైనది, ఇది ప్రతి ఒక్కరికి జరుగుతుంది. కానీ కొన్నిసార్లు అలసట తీవ్రంగా మరియు దీర్ఘకాలికంగా ఉండవచ్చు, ఇది మన దైనందిన జీవితానికి అంతరాయం కలిగించవచ్చు.
శారీరక అలసట యొక్క లక్షణాలు:
- నిద్రావశిష్టత
- శక్తి లేకపోవడం
- దృష్టి లోపం
- తలనొప్పి
- కండరాల నొప్పి
మానసిక అలసట యొక్క లక్షణాలు:
- ఒత్తిడి
- ఆందోళన
- నిరాశ
- విసుగు
- నిద్రలేమి
శారీరక మరియు మానసిక అలసటకు కారణాలు:
- అధిక శ్రమ
- తగినంత నిద్ర లేకపోవడం
- అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు
- వ్యాయామం లేకపోవడం
- ఒత్తిడి
- ఆందోళన
- నిరాశ
శారీరక మరియు మానసిక అలసటను నివారించడానికి చిట్కాలు:
- తగినంత నిద్ర పొందండి
- ఆరోగ్యకరమైన ఆహారం తినండి
- క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి
- ఒత్తిడిని నిర్వహించండి
- సహాయం కోసం అడగండి
మీరు శారీరకంగా మరియు మానసికంగా అలసిపోయి ఉంటే, మీరు మీ డాక్టర్‌తో మాట్లాడాలి. మీకు మీ అలసటకు కారణమయ్యే అంతర్లీన వైద్య పరిస్థితి ఉందో లేదో వారు నిర్ణయించవచ్చు.
మీరు అలసటను నిర్వహించడానికి మీరు చేయగలిగినవి కొన్ని ఉన్నాయి:
- మీ నిద్రను మెరుగుపరచుకోండి
- మీ ఆహారాన్ని మెరుగుపరచుకోండి
- మీ వ్యాయామాన్ని పెంచుకోండి
- మీ ఒత్తిడిని తగ్గించుకోండి
- సహాయం కోసం అడగండి
మీరు అలసటను నిర్వహించడానికి కొంత సమయం పట్టవచ్చు, కానీ ఇది సాధ్యం. మీరు కొన్ని మార్పులు చేస్తే, మీరు మరింత శక్తివంతంగా మరియు మంచి అనుభూతి చెందుతారు.