నట్స్‌లో ఎన్నో రకాలు ఉన్నాయి. వాటిలో బ్రెజిల్ నట్స్ కూడా ఒకటి. సెలెనియం, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం, ఒమేగా-3 ఫాట్టీ యాసిడ్స్, విటమిన్ సి, విటమిన్ ఇ, విటిమన్ బి, ప్రోటీన్, యాంటీ ఆక్సిడెంట్స్ ఇలా బోలెడన్ని పోషకాలు బ్రెజిల్ నట్స్‌లో నిండి ఉంటాయి. అందుకే ఆరోగ్యానికి బ్రెజిల్ నట్స్ అనేక ప్రయోజనాలను అందిస్తుంది. రెగ్యులర్‌గా డైట్లో ఈ నట్స్‌ను చేర్చుకుంటే బలహీనమైన ఎముకలు, కండరాలు బలంగా మారతాయి. సంతానలేమితో బాధ పడే దంపతులకు బ్రెజిల్ నట్స్ ఒక వరంగా చెప్పుకోవచ్చు. వీటిని ప్రతి రోజు తగిన మోతాదులో తీసుకుంటే పురుషుల్లో వీర్య కణాల వృద్ధి జరుగుతుంది. స్త్రీలో గర్భాశయ సమస్యలను నివారించి సంతానోత్పత్తిని పెంచుతాయి. అలాగే బ్రెజిల్ నట్స్‌ను తినడం వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. దాంతో అనేక వ్యాధిలు మీ దరి దాపుల్లోకి రాకుండా ఉంటాయి. అంతేకాదు, ప్రతి రోజు బ్రెజిల్ నట్స్‌ను తింటే మొటిమలు, మచ్చలు పోయి చర్మం యవ్వనంగా మారుతుంది. థైరాయిండ్ గ్రంథి సక్రమంగా పని చేస్తుంది. శరీరంలో ప్రోటీన్ కొరత ఏర్పడకుండా ఉంటుంది. ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్ వంటి మానసిక సమస్యలు తగ్గి మెదడు షార్ప్‌గా, యాక్టివ్‌గా మారుతుంది. గుండె ఆరోగ్యం మెరుగు పడుతుంది. శరీరంలో అధిక వేడి దూరం అవుతుంది. మలబద్ధకం సమస్య దరి చేరకుండా ఉంటుంది.
anxiety
గంజాయి నుంచీ తీసిన నూనెతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. గంజాయి నూనెను సైంటిఫిక్ రూపంలో CBD అంటారు. నిజానికి గంజాయి మొక్క నుంచీ 104 రకాల రసాయనాల్ని తీస్తారు. వాటన్నింటినీ కలిపి కన్నబినాయిడ్స్ అంటారు. వాటిలో నూనె అనేది ఒకటి మాత్రమే. ఈ గంజాయిని కాన్నబిస్ లేదా మారిజువానా మొక్క అని కూడా అంటారు. CBD వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉండటంతో ఔషధాల తయారీలో దాన్ని ఎక్కువగా వాడుతున్నారు. విపరీతమైన నొప్పి, టెన్షన్లను దూరం చెయ్యడంలో ఈ నూనె బాగా పనిచేస్తోంది. ప్రస్తుతం ప్రపంచంలో చాలా మంది డిప్రెషన్, టెన్షన్, ఒత్తిడి, కంగారు, బిజీ లైఫ్ స్టైల్‌తో జీవిస్తున్నారు. ఈ ఆతృత అనేది సర్వ రోగాలకూ పరోక్ష కారణమవుతోంది. గంజాయి నూనెతో మసాజులు, మర్దనల వంటివి చేసుకుంటే, ఎంతో కూల్‌గా, హాయిగా ఉంటుందనీ, టెన్షన్ల నుంచీ ఉపశమనం కలుగుతుందని పరిశోధనల్లో తేలింది. టెన్షన్ తగ్గేందుకు వాడే మందుల వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ. కాన్సర్‌ను తగ్గించే లక్షణాలు కూడా CBD ఆయిల్లో ఉన్నాయి. సాధారణంగా కాన్సర్ ఉన్నవారికి వికారంగా, వామ్టింగ్ అయ్యేలా ఉంటుంది. మన చర్మంపై మచ్చలు, మొటిమల వంటివి కామన్. అవి జన్యుపరమైన కారణాల వల్ల, బ్యాక్టీరియా వల్ల వస్తుంటాయి. వాటి నుంచీ తప్పించుకోవాలంటే గంజాయి నూనె వాడాలంటున్నారు పరిశోధకులు. ఇందులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు. మొటిమలు, మచ్చల అంతు చూస్తాయి. మతిమరపు లక్షణాలు తగ్గాలంటే ఈ నూనెతో తలకి మసాజ్ చేసుకోవాలి. అల్జీమర్స్, పార్కిన్సన్స్ వంటి వ్యాధుల నుంచీ మనల్ని మనం కాపాడుకోవాలంటే ఈ నూనె బాగా ఉపయోగపడుతుందంటున్నారు. ఆల్రెడీ ఈ వ్యాధులతో బాధపడేవారికి కూడా ఈ నూనె మంచి ఫలితాలు చూపిస్తోందని పరిశోధనల్లో తేలింది. హైబీపీని తగ్గించడంలో కూడా CBD ఆయిల్ బాగా పనిచేస్తోంది. హైబీపీ వల్ల గుండె పోటు వచ్చే ప్రమాదం ఉంటుంది. అందువల్ల బీపీ పెరగకుండా జాగ్రత్త పడాలి. అందుకు ఇలాంటి ఆయిల్స్ రిలాక్స్ ఫీల్ కలిగిస్తూ ఉంటే బీపీ ఆటోమేటిక్‌గా కంట్రోల్లో ఉంటుంది.






Total views : 78000