Health Tips:
గంగరేగు పండుకన్నా కాస్త పెద్దగాయాపిల్లా ఎర్రగా నిగనిగలాడుతుండే ఆల్బుకారా పండ్లను చూడగానే నోరూరుతుంది. చాలా మంది వీటిని అంతగా పట్టించుకోరు గానీ ఇవి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. వీటిల్లో కేలరీలు చాలా తక్కువ. సాధారణంగా పండ్లు తిన్న వెంటనే రక్తంలో గ్లూకోజు స్థాయిలు పెరుగుతుంటాయి. కానీ వీటితో అలాంటి ప్రమాదమేమీ ఉండదు. ఎందుకంటే వీటి ‘గ్త్లసిమిక్ ఇండెక్స్’ చాలా తక్కువ. ఆల్బుకారా పండ్లలో విటమిన్ సి దండిగా ఉంటుంది. అందువల్ల ఇవి రోగనిరోధకశక్తిని పెంచి, త్వరగా ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా కాపాడతాయి. మనం తిన్న ఆహారం నుంచి శరీరం ఇనుమును బాగా గ్రహించేలా కూడా చేస్తాయి. ఇక వీటిల్లోని ప్రోసైయానిడిన్, నియోక్లోరోజెనిక్యాసిడ్, క్యూర్సెటిన్ వంటి ఫెనోలిక్ రసాయనాలు శరీరంలో వాపు తగ్గేందుకు తోడ్పడతాయి. కణాలు దెబ్బతినకుండా కాపాడతాయి. ముదురు ఎరుపురంగులో ఉండే ఆల్బుకారా పండ్లలో ఈ ఫెనోలిక్ రసాయనాలు మరింత ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ పండ్లనూ వీలైనప్పుడల్లా తినటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.ఆల్బుకారా రోగాలన్నింటినీ తగ్గిస్తుందని నమ్మకాన్నిచ్చే పండు. దీన్ని ఇష్టంగా తినడానికి చెప్పుకునే కారణాలు చాలా కనిపిస్తున్నాయి. నేడు బజార్లో కూడా అంతే కన్నులకింపుగా కనిపిస్తున్నారు.
ఆరోగ్య ప్రయోజనాలు:
- జ్యూసీగా ఉండే ఈ పండులో కేలరీలు తక్కువ.
- జీర్ణశక్తిని మెరుగుపరిచే ఫైబర్ ఇందులో చాలా వుంది.
- విటమిన్ సికి ఈ పండు చిరునామాగా చెప్పుకోవచ్చు. ఇది మంచి యాంటీ ఆక్సిడెంటని వేరుగా చెప్పనవసరం లేదుగా!
- రోగనిరోధకశక్తిని పెంచడంలో ఇది మనకెంతగానో తోడ్పడుతుంది.
- విటమిన్ ఎ, బీటా కెరోటిన్లూ ఇందులో ఉన్నాయి.
- ఇందులో ఉన్న పొటాషియం గుండెజబ్బులు, రక్తపోటు రాకుండా కాపాడుతుంది.
- శరీర ఉష్ణోగ్రత సమతుల్యతను కాపాడుతుంది.
- ఇందులోని విటమిన్ కె ఎముకల పటిష్టతను కాపాడటానికి, ఆల్జీమర్స్ను నయం చేయడానికి సాయపడుతుంది.
- కంటి చూపును మెరుగుపరుస్తుంది.
- జ్వరా నికి, మలబద్ధకానికి మంచి విరుగుడుగా పేరెన్నికగన్నది ఆల్బుకారా పండ్లు.
- ఎండు ఆల్బుకారాలను రోజుకు 10 చొప్పున తీసుకుంటే ఎముకలు దృఢంగా తయారై ఎముక విరుపు సమస్యలుండవు . దీంతోపాటు మోనోపాజ్ దశ దాటిన మహిళల్లో సాధారణంగా కనిపించే బోలు ఎముకల వ్యాధి( ఆస్ట్రియోపోరోసిస్)ని కూడా ఇవి నివారిస్తాయని నిర్ధరించారు. అత్తిపండు(ఫిగ్), ఎండు ఖర్జూరాలు, ఎండు స్ట్రాబెపూరీలు, ఎండు ఆపిల్స్, ఎండు ద్రాక్షల కంటే ఈ ఎండు ఆల్బుకారాలు ఎముకల సామర్థ్యాన్ని పెంచడంలో మెరుగైనవని వెల్లడించారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఇది చదవండి: పుచ్చకాయలోని పోషక విలువలు..
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి.