గ్యాస్ట్రిక్ సమస్య ఉన్న వారు రోజుకు 4 లీటర్ల నీటిని తప్పనిసరిగా తాగాలి. ఆహారాన్ని ఒకేసారి ఎక్కువగా కాకుండా తక్కువ మోతాదులో తరచుగా తీసుకుంటూ ఉండాలి. ఆహారాన్ని నెమ్మదిగా తీసుకోవాలి మరియు మెత్తగా నమిలి మింగాలి. క్రమం తప్పకుండా ఉదయాన్నే అల్పహారం తినడం మరిచిపోకూడదు. మధ్యపానం, కూల్ డ్రింక్స్ మరియు కార్భోనేటెడ్ డ్రింక్స్ వంటి వాటికి దూరంగా ఉండాలి. పండ్లు, వెజిటబుల్ సలాడ్స్, నట్స్ వంటి వాటిని ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. పులుపు పదార్దాలు, పచ్చళ్లు, మసాలాలు, ఆయిల్పుడ్స్, జంక్ పుడ్స్ వంటివి ఎక్కువగా తీసుకోకూడదు. మైదా, సోయాబీన్స్, పాలు, శనగలు, రాజ్మా, నట్స్, పేస్ట్రీలు వంటి వాటికి దూరంగా ఉండాలి. పీచు పదార్థాలు, కీర, బీరకాయ ఎక్కువగా తీసుకోవడం వల్ల మలబద్దక సమస్య తగ్గి గ్యాస్ సమస్య బారిన పడకుండా ఉంటారు. ప్రతి రోజూ క్రమం తప్పక వ్యాయమం చేయడం మంచిది. ఒత్తిడికి గురి కాకుండా ఎల్లప్పుడూ ప్రశాంతంగా ఉండాలి. రాత్రి పూట ఆహారాన్ని పడుకునే 2 గంటల ముందు తీసుకోవాలి. ఎట్టి పరిస్దితుల్లోనూ మద్యపానం, ధూమపానం జోలికి వెళ్లకూడదు. ఈ నియమాలను క్రమం తప్పకుండా పాటించినట్లు అయితే గ్యాస్ట్రిక్ సమస్య నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు.
Read Also..
Read Also..