Friday, July 10, 2026
News Navigation
Friday, July 10, 2026
News Navigation

Breaking

Friday, July 10, 2026
Home Health మీ పెదవులు పగిలాయా.. ఈ చిట్కాలు మీ కోసమే!

మీ పెదవులు పగిలాయా.. ఈ చిట్కాలు మీ కోసమే!

by Satya
Are your lips chapped

చలికాలంలో చల్లటి గాలులు, పెదవులు పొడిబారడం, శరీరంలో నీటి శాతం తగ్గడం, విటమిన్ లోపం ఇంకా పెదవులను నాలుకతో తడపడం వంటి కారణాల వల్ల పెదవులు పగులుతాయి. పగిలిన పెదవుల వల్ల చలికాలంలో చాలా మంది బాధపడుతూ ఉంటారు. చాలా మంది ఈ సమస్య నుండి బయటపడడానికి లిప్ బామ్ లను ఇంకా లిప్ కేర్ లను వాడుతూ ఉంటారు. అయితే ఈ చిట్కాలు మీ కోసమే. పెదవుల పగుళ్లను తగ్గించే చిట్కాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ చిట్కాను వాడడం వల్ల పెదవులు పొడిబారడం తగ్గి మృదువుగా, తేమగా ఇంకా అందంగా తయారవుతాయి. పెదవులకు వెన్న రాసుకోవడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. వెన్నలో పంచదార వేసి పెదవులపై నెమ్మదిగా రాస్తూ మర్దన చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల పెదవులపై ఉండే మృతకణాలు, పొరలు తొలగిపోవడంతో పాటు పెదవులు మృదువుగా తయారవుతాయి. అలాగే పెదవులు గులాబిరంగులో మెరుస్తూ ఉంటాయి. పెదవులకు కొబ్బరి నూనె రాసుకోవడం వల్ల పెదవుల పగుళ్లు తగ్గుతాయి. పెదవులు పొడిబారకుండా ఉంటాయి. వేళ్లతో నువ్వుల నూనెను తీసుకుని పెదవులపై రాసి మర్దన చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల తగినంత తేమ లభించి పెదవుల పగుళ్లు తగ్గుతాయి. కలబంద గుజ్జును వాడడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. పెదవులపై కలబంద గుజ్జును రాసి అరగంట పాటు అలాగే ఉంచాలి. తరువాత నీటితో శుభ్రం చేయాలి. ఇలా రోజూ చేయడం వల్ల పెదవులు తేమగా ఉండడంతో పాటు పగుళ్లు కూడా తగ్గుతాయి.

Advertisements

You may also like

Our Visitor

039356
Total views : 196460

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: