చలికాలంలో ఎక్కువగా బయటకు తిరగరాదు. చిన్న పిల్లలను చల్లగాలిలో ఎక్కువ సమయం ఆడుకొనివ్వరాదు. శరీరాన్ని ఎల్లవేళలా వెచ్చగా ఉంచే స్వెట్టర్లు , స్కార్ప్ , టోపీలు, గ్లౌజులు, సాక్స్ లను ధరించడం మంచిది. జలుబు, గొంతు నొప్పి సమస్యలు ఉంటే ఆవిరిపట్టడం మంచిది. వెచ్చని నీటిలో ఉప్పు కలుపుకొని పుక్కిలించాలి. తరచూ వేడినీటిని తాగాలి. ఆహార పదార్థాలు వేడిగా ఉన్నప్పుడే భుజించాలి. చిన్నపిల్లలకు జలుబు సమస్యలు ఎక్కువగా ఉన్నప్పుడు ముక్కు రంధ్రాల్లో నాజల్ డ్రాప్స్, ఉప్పునీటి చుక్కలు వేయాలి. చలి తీవ్రత కారణంగా ఏర్పడే చర్మ సమస్యలకు దూరంగా ఉండడానికి మాయిశ్చరైజింగ్ క్రీం , లిప్‌బామ్, వాసెలైన్ లను అప్లై చేసుకోవాలి. స్నానానికి గ్లిజరిన్ ఎక్కువగా ఉండే సోపులను ఉపయోగించాలి. కొబ్బరి నూనెను రాసుకుని 15 నిమిషాల తర్వాత స్నానం చేయడంతో చర్మం పొడిబారకుండా ఉంటుంది. మనం తీసుకునే ఆహారంలో రోగనిరోధక శక్తిని పెంచే పోషకాలు ఉండేటట్టు చూసుకోవాలి. చలికాలంలో ఎక్కువగా అల్లాన్ని వినియోగించడంతో జలుబు, దగ్గులకు దూరంగా ఉండవచ్చు. ఈ కాలంలో పిల్లలకు పసుపు పాలు ఇవ్వడం మంచిది.
చలికాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు
64
previous post