చలికాలంలో ఎక్కువగా బయటకు తిరగరాదు. చిన్న పిల్లలను చల్లగాలిలో ఎక్కువ సమయం ఆడుకొనివ్వరాదు. శరీరాన్ని ఎల్లవేళలా వెచ్చగా ఉంచే స్వెట్టర్లు , స్కార్ప్ , టోపీలు, గ్లౌజులు, సాక్స్ లను ధరించడం మంచిది. జలుబు, గొంతు నొప్పి సమస్యలు ఉంటే ఆవిరిపట్టడం మంచిది. వెచ్చని నీటిలో ఉప్పు కలుపుకొని పుక్కిలించాలి. తరచూ వేడినీటిని తాగాలి. ఆహార పదార్థాలు వేడిగా ఉన్నప్పుడే భుజించాలి. చిన్నపిల్లలకు జలుబు సమస్యలు ఎక్కువగా ఉన్నప్పుడు ముక్కు రంధ్రాల్లో నాజల్ డ్రాప్స్, ఉప్పునీటి చుక్కలు వేయాలి. చలి తీవ్రత కారణంగా ఏర్పడే చర్మ సమస్యలకు దూరంగా ఉండడానికి మాయిశ్చరైజింగ్ క్రీం , లిప్‌బామ్, వాసెలైన్ లను అప్లై చేసుకోవాలి. స్నానానికి గ్లిజరిన్ ఎక్కువగా ఉండే సోపులను ఉపయోగించాలి. కొబ్బరి నూనెను రాసుకుని 15 నిమిషాల తర్వాత స్నానం చేయడంతో చర్మం పొడిబారకుండా ఉంటుంది. మనం తీసుకునే ఆహారంలో రోగనిరోధక శక్తిని పెంచే పోషకాలు ఉండేటట్టు చూసుకోవాలి. చలికాలంలో ఎక్కువగా అల్లాన్ని వినియోగించడంతో జలుబు, దగ్గులకు దూరంగా ఉండవచ్చు. ఈ కాలంలో పిల్లలకు పసుపు పాలు ఇవ్వడం మంచిది.
ginger
ప్రస్తుత కాలంలో ఎవరిని పలకరించినా కూడా నొప్పులు ఉన్నాయని బాధపడుతూనే ఉంటారు. చిన్నా, పెద్దా అని వయసు తేడా లేకుండా ప్రతి ఒక్కరిలోనూ ఈ నడుము నొప్పి అనేది ఎక్కువ బాధ కలిగిస్తుంది. ఈ పోటీ ప్రపంచంలో అసలే గంటల తరబడి కూర్చుని పనులు చేయడం ద్వారా ఎక్కువ శాతం నడుము నొప్పికి గురవుతున్నారు. ఎన్ని రకాల మందులు వాడినా అప్పటికీ మాత్రమే ఉపశమనం కలుగుతుంది. మరి నడుము నొప్పిని ఎలా నివారించాలో ఇక్కడ తెలుసుకుందాం. కొద్దిగా అల్లంను తీసుకుని దానిని మెత్తగా రుబ్బి నొప్పి ఉన్నచోట అప్లై చేయాలి. ఒక ఇరవై నిమిషాలు ఆగిన తర్వాత మీకు నడుము నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అలాగే కొన్ని అల్లం ముక్కలను బాగా మరిగించి, ఆ నీటిని చల్లార్చిన తర్వాత ఒక రెండు స్పూన్ల తేనెను కలుపుకుని తాగడం ద్వారా తొందరగా నడుము నొప్పి తగ్గు ముఖం పడుతుంది. ఇది పరగడుపున తాగడం వల్ల మంచి ఫలితాన్ని పొందవచ్చు. కొద్దిగా ఆవ నూనె, నువ్వుల నూనె రెండు సమపాళ్లలో కలుపుకుని, గోరువెచ్చగా నూనెను వేడిచేసి నొప్పి ఉన్న చోట బాగా మర్దన చేయడం ద్వారా నడుము నొప్పితో పాటు ఇంకా ఏ రకమైన కీళ్ల నొప్పులు ఉన్నా కూడా తొందరగా తగ్గిపోతాయి. శొంఠి బాగా నూరి ఒక మిశ్రమంలా తయారు చేసుకొని నొప్పి ఉన్నచోట పట్టాలా వేసుకోవాలి. దీనిపై తెల్ల జిల్లేడు ఆకులను పెట్టి కట్టు కట్టడం ద్వారా నడుము నొప్పి నుంచి ఉపశమనం పొందుతారు. ఇలా తరచూ చేస్తూ ఉండటం ద్వారా నడుము నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ద్విచక్ర వాహనాలు నడిపేవారు నిటారుగా కూర్చొని నడపడం, ఆఫీసులో వర్క్ చేసేవారు రెండు కాళ్లు సమాంతరంగా నేలకు ఉండేలా చూసుకోవాలి. వెన్నును వంచకుండా నిటారుగా ఉండేలా కూర్చోవాలి. ఎక్కువసేపు ఒకే చోట కూర్చోకుండా గంటకు ఒక సారైనా లేచి అటూ ఇటూ నడుస్తూ ఉండాలి. ఇలా చేయడం ద్వారా నడుము నొప్పి వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. వీటితోపాటు బలమైన ఆహారం తీసుకోవడం ద్వారా నడుము నొప్పి రాకుండా నివారించుకోవచ్చు. అందులో మినప్పప్పు చాలా ముఖ్యమైనది. ఇందులో ఉన్న ఫైబర్, విటమిన్స్, ప్రొటీన్లు, శరీరానికి మంచి పోషణ కలిగిస్తాయి. ఈ పప్పు ఎముకల్లో బలాన్ని చేకూరుస్తుంది. వీటితో పాటు పండ్లు, క్యాల్షియం అధికంగా ఉన్న పదార్థాలు తీసుకోవడం ద్వారా నడుము నొప్పి నుంచి నివారణ పొందవచ్చు.
స్థానిక కోయంబేడు మార్కెట్లో దిగుమతులు తగ్గడంతో అల్లం ధర పెరిగింది. మార్కెట్‌కు కేరళ, కర్ణాటక, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల నుంచి ప్రతిరోజు 200 టన్నుల అల్లం దిగుమతి అవుతుండేది. కానీ ఆదివారం 130 టన్నులు మాత్రమే దిగుమతి అయ్యింది. దీంతో కొత్త అల్లం కిలో 80రూపాయల నుంచి 110 రూపాయలు, పాత అల్లం 230రూపాయలు, చిన్న ఉల్లి 80రూపాయల నుంచి 120రూపాయలు.., బళ్లారి ఉల్లి 50రూపాయల నుంచి 65రూపాయలు, టమోటా కిలో 30రూపాయలు, రెండో రకం 25రూపాయలు, మూడో రకం 15రూపాయల నుంచి 20రూపాయలకు విక్రయమయ్యాయి. దీంతో పెరిగిన రేట్లతో కొనుగోలుదారుల బెంబేలెత్తిపోతున్నారు.
మొదటి ముద్దగా అన్నంలో శొంఠిని పలుచగా కలిపి నేతితో తింటే, అజీర్తి పోతుందని నమ్మకం. బాలింతరాలుకు శరీరము గట్టి పడేందుకు, వేడి కలిగేందుకు శొంఠిని విస్తృతంగా వాడుతారు పిల్లలకు అజీర్ణం తగ్గేందుకు చాలా తక్కువ మోతాదులో దీనిని వాడుతారు. ఆయుర్వేద మందులలో ఇది ఎక్కువ కనిపిస్తుంది. అల్లం మంచి యాంటి ఆక్షిడెంట్ గా పని చేస్తుంది. రక్త శుద్దికి తోడ్పడుతుంది. రక్తం రక్త నాళాల లో గడ్డకట్టనీయకుండా సహాయపడుతుంది. అల్లం కొన్ని వారాలపాటు వాడితే కీళ్ళ నొప్పులు తగ్గుతాయి. అల్లం వల్ల కడుపులో పూత (అల్సరు) ఏర్పడదు. అల్లము నోటి దుర్వాసనను పోగొడుతుంది. నోటిలో చేరిన ప్రమాదక బ్యక్టీరియల్ను సంహరించి , దంటాలను ఆరొగ్యము గా ఉంచుతుంచి.
Read also..
Read also..





Total views : 91126