Saturday, July 18, 2026
News Navigation
Saturday, July 18, 2026
News Navigation

Breaking

Saturday, July 18, 2026
Home Latest News తెలంగాణ లో రాబోయేది బీజేపీ ప్రభుత్వమే -మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు.

తెలంగాణ లో రాబోయేది బీజేపీ ప్రభుత్వమే -మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు.

by CVR NEWS
తెలంగాణ లో రాబోయేది బీజేపీ ప్రభుత్వమే -మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు

కరీంనగర్ గడ్డ బిజెపి అడ్డాగా బండి సంజయ్ నిలబెట్టారని, ఇటీవల జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బిజెపి విజయం సాధించడంలో బండి సంజయ్ పట్టుదల, కరీంనగర్ బిజెపి శ్రేణుల కసి తోనే బల్దియా పై కాషాయ జెండా ఎగిరిందనీ, ఇలాంటి ఫలితం కోసం తెలంగాణ వ్యాప్తంగా బిజెపి నాయకులు కార్యకర్తలు ఎదురు చూస్తున్నారని, కార్యకర్తల కృషి తో రాబోయే రోజుల్లో తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని బీజేపీ సీనియర్ నేత , మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు ఆశాభావం వ్యక్తం చేశారు. బిజెపి శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు హాజరై మాట్లాడారు. మోదీ ప్రభుత్వ తీరుపై దేశ ప్రజలకు అనలేని విశ్వాసం , నమ్మకం ఏర్పడిందన్నారు. దేశవ్యాప్తంగా బిజెపి, ఎన్డీఏ కి వస్తున్న ఫలితాలే నిదర్శనం అన్నారు. శిక్షణ కార్యక్రమాలు నాయకత్వ లక్షణాలు మెరుగుపరచుకోవడానికి, పార్టీని మరింత బలోపేతం చేయడానికి ఎంతో దోహదం చేస్తాయన్నారు.

Advertisements

You may also like

Our Visitor

041212
Total views : 214653

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: